బుధవారం 28 అక్టోబర్ 2020
Mulugu - Sep 20, 2020 , 06:30:04

ఆటో డ్రైవర్‌ అదృశ్యం

ఆటో డ్రైవర్‌ అదృశ్యం

ములుగురూరల్‌ :  ఆటో డ్రైవర్‌ అదృశ్యమైన సంఘటన ములుగు జిల్లా కేంద్రంలో శనివారం చోటు చేసుకుంది.  పోలీసుల కథనం ప్రకారం.. జిల్లా కేంద్రానికి చెందిన చిట్యాల రవి(59) ఆటో డ్రైవర్‌గా పనిచేస్తూ జీవిస్తునాడు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం పాలు తీసుకువస్తానని ఇంట్లో చెప్పి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు చుట్టుపక్కల వారు, బంధువుల వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో రవి కుమారుడు రాజేందర్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి రవి కోసం గాలిస్తున్నట్లు ఎస్సై హరికృష్ణ తెలిపారు. logo