శుక్రవారం 23 అక్టోబర్ 2020
Mulugu - Sep 19, 2020 , 05:59:04

గ్రీన్‌ చాలెంజ్‌ను స్వీకరించిన అదనపు కలెక్టర్‌

గ్రీన్‌ చాలెంజ్‌ను స్వీకరించిన అదనపు కలెక్టర్‌

ములుగు, సెప్టెంబర్‌18: రాజ్యసభ సభ్యుడు, టీన్యూస్‌ ఎండీ జోగినపల్లి సంతోష్‌కుమార్‌ పర్యావరణ పరిరక్షణ కోసం ప్రారంభించిన గ్రీన్‌   చాలెంజ్‌లో భాగంగా ఇటీవల కలెక్టర్‌ ఎన్‌.కృష్ణ ఆదిత్య గ్రీన్‌ చాలెంజ్‌లో మొక్కలు నాటి అదనపు కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభీకి చాలెంజ్‌ను విసరగా ఆయన శుక్రవారం తన నివాసంలో మొక్కలు నాటారు. తన తోటి అధికారులైన మరో ఇద్దరికి చాలెంజ్‌ను విసిరినట్లు ఆయన తెలిపారు. కామారెడ్డి జిల్లాలో పనిచేస్తున్న ఐఏఎస్‌ అధికారి తేజస్‌ పవార్‌తోపాటు జోగులాంబ గద్వాల జిల్లాలో అదనపు కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న శ్రీహర్షకోయకు చాలెంజ్‌ను విసిరినట్లు ట్విట్టర్‌ వేదికగా పేర్కొన్నారు.


logo