ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Mulugu - Aug 14, 2020 , 02:26:13

ఆర్టీసీ బస్సుపై కూలిన చెట్టు

ఆర్టీసీ బస్సుపై కూలిన చెట్టు

  • కండక్టర్‌కు స్వల్ప గాయాలు

గణపురం: మండల కేంద్రంలో ఆర్టీసీ బస్సుపై గురువారం చెట్టు కూలింది. వివరాలిలా ఉన్నాయి. పరకాల నుంచి గణపురానికి ఉద యం పల్లె వెలుగు (టీఎస్‌ 03 యూబీ 8473) బస్సు ప్రయాణికుల తో బయలుదేరింది. ఈ క్రమంలో మండల కేంద్రం కోటకాల్వ సమీ పంలో గాలివానకు రోడ్డు పక్కన ఉన్న చెట్టు బస్సుపై కూలగా ముం దు భాగం ధ్వంసమైంది. బస్సులో డ్రైవర్‌, కండక్టర్‌తోపాటు ఐదుగు రు ప్రయాణికులు ఉన్నారు.

కండక్టర్‌ లక్ష్మి స్వల్ప గాయాలతో బయ టపడ్డారు. ఎవరికి ఏమీ కాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. దీంతో ములుగు, పరకాల వైపు వెళ్లే వాహనాల ట్రాఫిక్‌కు అంతరా యం కలిగింది. ఘటనా స్థలానికి స్థానిక ఎస్సై శేషాల రాజన్‌బాబు సిబ్బందితో చేరుకొని జేసీబీ సహాయంతో వర్షంలో మూడు గంటల పాటు శ్రమించి కూలిన చెట్టును తొలగించారు. 


logo