గురువారం 24 సెప్టెంబర్ 2020
Mulugu - Aug 13, 2020 , 02:50:19

స్పందించి.. సాయమందించి

స్పందించి.. సాయమందించి

  • ‘గిఫ్ట్‌ ఏ స్మైల్‌'కు విశేష స్పందన 
  • అంబులెన్స్‌ల కొనుగోలుకు జిల్లా ప్రజాప్రతినిధుల సహకారం
  • మంత్రి కేటీఆర్‌కు రూ.20.50 లక్షల చొప్పున చెక్కులు ఇచ్చిన గండ్ర, చల్లా, రవిచంద్ర, లక్ష్మణ్‌రావు

భూపాలపల్లి టౌన్‌/ములుగు/కేసముద్రం టౌన్‌/పరకాల : టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ పుట్టిన రోజున పిలుపునిచ్చిన ‘గిఫ్ట్‌ ఎ స్మైల్‌'కు స్పందించి అంబులె న్స్‌ల కొనుగోళ్లకు సహకరించేందుకు వరంగల్‌ ప్రజాప్రతి నిధులు, పార్టీ సీనియర్‌ నాయకులు ముందుకొచ్చారు. ఈమేరకు బుధవారం హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో కేటీఆర్‌ను కలిసి తమ వంతు సాయాన్ని చెక్కుల రూపంలో అందిం చారు. ఈమేరకు పరకాల నియోజకవర్గానికి కా వాల్సిన అంబులెన్స్‌కు అవసరమయ్యే రూ.20.50లక్షల చె క్కును చల్లా చారిటబుల్‌ ట్రస్టు ద్వారా మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతిరాథోడ్‌తో కలిసి ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అందించారు.

‘గిఫ్ట్‌ ఎ స్మైల్‌' పేదల జీవితాల్లో వెలుగులు నింపుతుందని ఎమ్మెల్యే అన్నారు. ఈ అంబులెన్స్‌లో ఆక్సిజన్‌, వెంటిలేటర్‌ సౌకర్యం ఉంటుందని, కరోనా వైరస్‌ వచ్చినవారు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా ధైర్యంగా ఉండాలన్నారు. మనోధైర్యమే మనల్ని కాపాడుతుందని, నియోజకవర్గ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని చెప్పారు. అలాగే భూపాలపల్లి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణరెడ్డి, వరంగల్‌ రూరల్‌ జడ్పీ చైర్‌పర్సన్‌ గండ్ర జ్యోతి మంత్రి కేటీఆర్‌కు రూ.20 లక్షల50 వేల చెక్కును అందజేశారు. అలాగే ములుగు జిల్లా ప్రజల అవసరాల కోసం టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకు లు కాకులమర్రి లక్ష్మణ్‌రావు తన వంతుగా రూ.20 లక్షల 50వేల చెక్కును మంత్రికి అందించారు. కేటీఆర్‌ పిలుపులో భాగంగా గిఫ్ట్‌ఏ స్మైల్‌లో తాను పాలుపంచుకోవడం చాలా ఆనందంగా ఉందని లక్ష్మణ్‌రావు పేర్కొన్నారు. అలాగే కేసముద్రం మండలం ఇనుగుర్తి గ్రామానికి చెందిన గాయత్రి గ్రానైట్స్‌ అధినేత, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు వద్దిరాజు రవిచంద్ర మంత్రి కేటీఆర్‌కు చెక్కు అందించారు. వారితో పాటు మహబూబాబాద్‌ ఎంపీ మాలోత్‌ కవిత ఉన్నారు.


logo