గురువారం 24 సెప్టెంబర్ 2020
Mulugu - Aug 12, 2020 , 02:40:18

ప్రారంభం కాని దవాఖానాపై అక్కసు

ప్రారంభం కాని దవాఖానాపై అక్కసు

ములుగు, నమస్తేతెలంగాణ: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రజలందరికీ కార్పొరేటర్‌ స్థాయి వైద్య సేవలను అందించేందు అనేక  దవాఖానలను ఉన్నతీకరించుడంతో పాటు నూతనంగా ఏర్పడిన జిల్లాలో అత్యాధునిక వసతులతో   కూడిన నూతన దవాఖానలను నిర్మించేందుకు శ్రీకారం చుట్టింది, 2015లో జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో  సర్వే నం.141లో రూ.26 కోట్ల 90 లక్షలతో 100 పడకల  దవాఖాన నిర్మించారు. నిర్మాణం పూర్తి  కాగా అందులో పని చేయడానికి కావలసిన వైద్యులు, పారామెడికల్‌ సిబ్బందిని నియమించే ప్రక్రియను చేపట్టాల్సి ఉంది. కనీసం ప్రారంభం కాకుండానే వైద్య సేవలను ఎలా అందిస్తుందని, దానిలోకి వర్షపు నీరు పోయిందని,  ఏదో ప్రమాదం జరిగినట్లు కొంతమంది పని కట్టుకొని సోషల్‌ మీడియా కేంద్రంగా దుష్ప్రచారం చేస్తున్నారు. ఈవిధానం సరికాదనే భావన వ్యక్తం అవుతోంది.

ప్రహరీ పక్కన నిలిచిన వర్షపు నీరు

రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు భూపాలపల్లి జిల్లాకేంద్రం మంజూర్‌నగర్‌లో నిర్మించిన 100 పడకల దవాఖాన ప్రహరీని ఆనుకొని వర్షపు నీరు నిలిచింది. దీనిని  చూసి కొందరు ఇష్టం వచ్చిన  వైపునుంచి  వీడియో, ఫొటోలు తీసి కొసోషల్‌ మీడియా కేంద్రంగా  ప్రచారం చేస్తూ జిల్లా ప్రజలను ఆయోమయానికి గురి చేస్తున్నారు. దవాఖాన భవనం మాత్రమే పూర్తి అయింది.  దవాఖానకు వాహనాలు, అంబులెన్స్‌లు ఇతర రవాణ సౌకర్యాల కోసం పూర్తి స్థాయి రోడ్డును నిర్మించాల్సి ఉంది. దీనిని మచిరి కొందరు అవగాహన లేకుండా రోడ్డుకు ఇరువైపులా ఉన్న  కాలువలోకి  చేరిన వర్షపు నీటిని  చూపించి దవాఖానలోకి వర్షపు నీరు చేరినట్లు దుష్ప్రచారం చేస్తున్నారు. ఇది పూర్తిగా అవాస్తం.

ప్రారంభం కాని దవాఖానపై అక్కసు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కేంద్రంతో  పాటు  మారుమూల ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించేందుకు నిర్మించి, కనీసం ప్రారంభోత్సవం చేయని, సేవలను ప్రారంభించని దవాఖానపై సోషల్‌ మీడియా కేంద్రంగా కొంత మంది పని కట్టుకొని  అక్కసు వెళ్లగక్కుతూ, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రజోపయోగమైన  కార్యక్రమాలపై ప్రజల్లోకి తప్పుడు సంకేతాలను పంపించటమే పనిగా పెట్టుకొన్నారు. దీనిపై జిల్లాప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు ఉపయోగపడే దేవాలయం వంటి దవాఖానపై ఏదో ముంచుకు పోయిందనే విధంగా రాజకీయ నిరుద్యోగులు ప్రచారం చేయడం మానుకోవాలని  స్థానికులు  సూచిస్తున్నారు. 100 పడకల దవాఖాన ప్రారంభమై, జిల్లాలోని  నలుమూలలకు చెందిన వారికి  కార్పొరేట్‌ స్థాయి వైద్య సేవలను అందించేలా విలసిల్లాలని స్థానికులు  కోరుతున్నారు. మంచి పనులు చేస్తే పది మందికి చెప్పాలని, చెడు అనిపిస్తే అది ఒక్కరికే చెప్పాలనే సామాజిక సూత్రాలను సదరు సోషల్‌ మీడియాలో  దుష్ప్రచార చేసే వ్యక్తులు గుర్తించాలని పలువురు సూచిస్తున్నారు.logo