సోమవారం 28 సెప్టెంబర్ 2020
Mulugu - Aug 12, 2020 , 02:40:16

కరోనా కట్టడికి సమన్వయంతో పని చేయాలి

కరోనా కట్టడికి సమన్వయంతో పని చేయాలి

పాలకుర్తి రూరల్‌, ఆగస్టు 11 : కరోనా వైరస్‌ కట్టడికి ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. మంగళవారం హై దరాబాద్‌ నుంచి పాలకుర్తి మండల ప్రజా ప్రతినిధులు, అధి కారులు, ముఖ్య నాయకులతో కరోనా కట్టడి, కమిటీలు, అభి వృద్ధి పనులపై ఆయన టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సం దర్భంగా మాట్లాడుతూ గ్రామాల్లో అన్ని రాజకీయ పార్టీలతో కలిసి (అఖిలపక్షం) కరోనా కమిటీలు వేయాలని సూచించా రు. పాలకుర్తి, తొర్రూరు మండలాలకు రెండు అంబులెన్స్‌లు మంజూరు చేశానన్నారు. వాటిని ఈ నెల 15లేదా 17న ప్రా రంభించనున్నట్లు చెప్పారు. పాలకుర్తిలో లాక్‌డౌన్‌ పకడ్బం దీగా అమలు చేయాలన్నారు. మద్యం షాపులు, పబ్లిక్‌ స్థలా లపై స్థాని కులతో కలిసి నిఘా  పెంచాలని పోలీస్‌, రెవెన్యూ అధికారులకు సూచించారు. మాస్కులు లేకుండా తిరిగితే జరిమానా విధించాలని పోలీసులకు సూచించారు. పాలకుర్తి లోని వెలుగు బాలికల పాఠశాలను క్వారంటైన్‌ కేంద్రం కోసం పరిశీలించాలని స్థానిక నేతలను ఆదేశించారు. పల్లె ప్రగతి పథకం నిరంతరం కొనసాగిస్తుండడంతో కరోనా ఆదుపులో  ఉందన్నారు. కరోనాపై ప్రజల్లో భయం నెలకొందని కమిటీలు వారిలో ధైర్యాన్ని నింపాలన్నారు. బాధితులకు వైద్యం, నిత్యా వసర వస్తువులు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. స్థానిక ప్రజా ప్రతినిధులు ఇళ్లకు పరిమితం కావొద్దన్నారు. వైరస్‌ను ఎదుర్కొంటూనే మండలంలోని అభివృద్ధి పనులు కొనసాగిం చాలని సూచించారు. రైతు వేదికలు, కల్లాలు, నర్సరీలు, ప్రకృ తి వనాలు, డంపింగ్‌ యార్డులు, వైకుంఠ దామాల పనుల్లో వేగం పెంచాలన్నారు. గ్రామ పంచాయతీ నిధుల నుంచి 10 శాతం గ్రీనరీకి వాడుకోవాలన్నారు. సీఎం కేసీఆర్‌ సూచించిన విధంగా ప్రజా ప్రతినిధులు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు కరోనా కట్డడికి కృషి చేయాలన్నారు. ప్రజలను కష్టకా లంలో ఆదుకుంటేనే ప్రజా ప్రతినిధులకు, అధికారులకు గుర్తింపు ఉంటుందన్నారు. ఈ సమావేశంలో ఎంపీపీలు, జడ్పీటీసీలు, రైతు బంధు సమితి కో ఆర్డినేటర్లు, ఎఫ్‌ఎస్‌సీఎస్‌ బ్యాంక్‌, మార్కెట్‌ చైర్మన్లు, పోలీసులు, రెవెన్యూ, డాక్టర్లు, ఇంజినీరింగ్‌ ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.


logo