ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Mulugu - Aug 10, 2020 , 01:44:13

సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక తీజ్‌

సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక తీజ్‌

రాష్ట్ర ఆర్టీఐ కమిషనర్‌ శంకర్‌నాయక్‌

మరిపెడ: గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలకు తీజ్‌ పండుగ ప్రతీకగా నిలుస్తుందని రాష్ట్ర ఆర్టీఐ కమిషనర్‌ గుగులోతు శంకర్‌నాయక్‌ అన్నారు. ఆదివారం రాత్రి మరిపెడ మండలం నేతావత్‌ తండా జీపీలో జరిగిన తీజ్‌ వేడుకల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ఆదివాసీ, గిరిజన దినోత్సవం సందర్భంగా ఆయా తెగలకు శుభాకాంక్షలు చెప్పారు. గిరిజన తండాల అభివృద్ధికి సీఎం కేసీఆర్‌ అధిక ప్రాధా న్యం ఇస్తున్నట్లు తెలిపారు. నేటి హైటెక్‌ యుగంలో సై తం యువతులు తమ సంస్కృతీ సంప్రదాయాలను రేపటి తరానికి అందివ్వడానికి తీజ్‌ వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గుగులోతు రాజునాయక్‌, నరేశ్‌, సురేశ్‌, మదన్‌లాల్‌, సైదులు, నా గులాల్‌, పాప్‌లాల్‌, చంటి, బాలు పాల్గొన్నారు.

బయ్యారం : మండలంలోని బాల్య తండాలో జరిగి న తీజ్‌ వేడుకల్లో జడ్పీచైర్‌పర్సన్‌ అంగోత్‌ బిందు పా ల్గొని మహిళలతో కలిసి నృత్యం చేశారు. 

తీజ్‌ ఉత్సవాలు పవిత్రమైనవి

మహబూబాబాద్‌ రూరల్‌ : గిరిజనులకు తీజ్‌ ఉత్సవాలు పవిత్రమైనవని లంబాడా హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు బోడ లక్ష్మణ్‌ నాయక్‌ అన్నా రు. ఆదివారం మండల పరిధిలోని అయోధ్యభజన తండాలో తీజ్‌ ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గిరిజనులు ఎంతో నిష్ట తో తీజ్‌ ఉత్సవాలు జరుపుకుంటారని అన్నారు. అనంతరం సేవాలాల్‌ చిత్రపటానికి పూలమాల పూజలు చేశారు. కార్యక్రమంలో ఎల్‌హెచ్‌పీఎస్‌ మండల అధ్యక్షుడు ఆంగోతు సుధాకర్‌, భూక్య మోహన్‌, బానోతు కృష్ణ, వినోద్‌, జగన్‌, శిరీష, అనూష పాల్గొన్నారు. 

కురవి: మండలంలోని పలు తండాల్లో ఆదివారం గిరిజనులు తీజ్‌ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జుజ్జూరుతండాలో సీరోలు ఎస్సై చంద్రమోహన్‌ తీజ్‌ వేడుకలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ ఎస్టీ మండల అధ్యక్షుడు బానోత్‌ రాము, వైద్యులు వీరన్ననాయక్‌, తండా పెద్దలు పాల్గొన్నారు.  నేరడ శివారు బాల్యతండాలో కురవి ఎంపీపీ గుగులో త్‌ పద్మావతి తీజ్‌ వేడుకల్లో పాల్గొన్నారు.

డోర్నకల్‌: మున్సిపాలిటీ పరిధిలోని ట్రంక్‌ తండాలో తీజ్‌ వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్‌ అమల, మాజీ ఎంపీటీసీ భద్రునాయక్‌, హరిలాల్‌, కిశోర్‌బాబు పాల్గొన్నారు.logo