శనివారం 26 సెప్టెంబర్ 2020
Mulugu - Aug 07, 2020 , 04:53:36

సఖీ సేవలపై అవగాహన

సఖీ సేవలపై అవగాహన

 ములుగురూరల్‌, ఆగస్టు6: జంగాలపల్లి గ్రామంలో వరినాట్లు వేస్తున్న మహిళా కూలీలకు సఖీ సెంటర్‌ ద్వారా మహిళలకు కల్పించే భద్రత, భరోసాలపై సఖీ సెంటర్‌ నిర్వాహకురాలు రజిత గురువారం అవగాహన కల్పించారు. సఖీ సెంటర్‌ ద్వారా 5 విభాగాల్లో మహిళలకు సేవలు అందించున్నట్లు తెలిపారు. మహిళలకు సమస్య తలెత్తిన సమయంలో 181కు ఫోన్‌ చేయాలని సూచించారు. ఆమె వెంట లీగల్‌ కౌన్సిలర్‌ సత్యనారాయణ, ఐటీ అసిస్టెంట్‌ కిరణ్‌ ఉన్నారు.


logo