మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Mulugu - Aug 06, 2020 , 03:29:59

174 కిలోల గంజాయి పట్టివేత

174 కిలోల గంజాయి పట్టివేత

ములుగు, ఆగస్టు5: ములుగు జిల్లా కేంద్రం పరిధిలోని ఇంచర్ల గ్రామపంచాయతీ ఎర్రిగట్టమ్మ వద్ద బుధవారం 174 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఎస్పీ విలేకరు ల సమావేశం ఏర్పాటు చేసి వివరాలను వెల్లడించారు. జాతీ య రహదారి మీదుగా భారీ ఎత్తున గంజాయి రవాణా చేస్తు న్నారని అందిన సమాచారం మేరకు సీఐ కొత్త దేవేందర్‌ రెడ్డి ఆదేశాల మేరకు వెంకటాపూర్‌ ఎస్సై భూక్య నరహరి సిబ్బం దితో కలిసి బుధవారం ఉదయం ఎర్రిగట్టమ్మ వద్ద వాహనా లను తనిఖీ చేస్తున్నాడు. ఈ క్రమంలో మారుతి బెలోనో కారు(టీఎస్‌ 24సి 9813) పస్రా నుంచి ములుగుకు వస్తుం డగా ఆపేందుకు యత్నించగా ఆగకుండా వెళ్లింది. పోలీసులు కారును వెంబడించి తనిఖీ చేయగా 174 కిలోల గంజాయి (87 ప్యాకెట్లు) బయటపడింది. ఓ వ్యక్తి పారిపోగా, మరో ఇద్దరు దొరికారు. తహసీల్దార్‌ ఎదుట పంచనామా నిర్వహిం చి నిందితులను విచారించారు. ములుగు మండలం పంది కుంటకు చెందిన చెక్క కుమారస్వామి కారు డ్రైవర్‌గా పనిచే సేవాడు. రేగొండ మండలం గోరికొత్తపల్లి గ్రామానికి చెంది న శంకర్‌ పందికుంటకు వారి బంధువుల ఇంటికి వచ్చాడు. ఈ క్రమంలో వీరికి పరిచయం ఏర్పడగా డ్రైవర్‌గా వచ్చే డ బ్బులు కుటుంబ పోషణకు సరిపోవడం లేదని కుమారస్వా మి తెలిపాడు. గంజాయి వ్యాపారం గురించి చెప్పి ఒకసారి తనతో వస్తే సమస్యలు అన్ని తీరిపోతాయని శంకర్‌ చెప్పా డు. ఈ క్రమంలో 15 రోజుల క్రితం శంకర్‌ పందికుంటకు వచ్చి అంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా లక్కవరం నుంచి గంజాయిని కొని తీసుకొద్దామని, తమతోపాటు ఎవ రైనా ఉంటే వెంట తీసుకెల్దామన్నాడు. దీంతో కుమారస్వామి తన బంధువు రాగుల పోశాలుకు విషయం చెప్పి ఒప్పించా డు. ముగ్గురు కలిసి లక్కవరం వెళ్లి 20 కేజీల గంజాయి ని కిలో రూ.1500 చొప్పున కొని పందికుంటలోని పోశాలు ఇంట్లో నిల్వ చేశారు. అనంతరం హైదరాబాద్‌ నుంచి వచ్చిన వ్యాపారులు కిలో రూ.8 వేల చొప్పున కొనుగోలు చేసి తీసు కెళ్లారు. వచ్చిన డబ్బుల నుంచి ముగ్గురు మూడు వాటాలు పంచుకున్నారు. మళ్లీ ఈ నెల 4వ తేదీన కుమారస్వామి బెలోనో కారులో మిగతా ఇద్దరు లక్కవరం గ్రామానికి వెళ్లి 174 కిలోల గంజాయిని కొనుగోలు చేశారు. కారు డిక్కీలో లోడ్‌ చేసుకొని అదే రోజు రాత్రి 11.30 గంటల ప్రాంతంలో బయలుదేరి ములుగు మండలం పందికుంటకు వస్తుండగా ఇంచర్ల గట్టమ్మ గుడి వద్దకు వచ్చే సరికి పోలీసులను చూసి శంకర్‌ పారిపోయాడు. రూ. 13.93 లక్షల గంజాయిని స్వాధీనం చేసుకుని,  పోశాలు, కుమారస్వామిని అరెస్టు చేశా రు. శంకర్‌ను త్వరలోనే పట్టుకుంటామని ఎస్పీ వెల్లడించా రు. గంజాయి పట్టుకున్న పోలీస్‌ సిబ్బందిని ఆయన అభినం దించారు. సమావేశంలో ఏఎస్పీ సాయిచైతన్య, సీఐ దేవేంద ర్‌రెడ్డి, ఎస్సై భూక్య నరహరి, తదితరులు ఉన్నారు. 


logo