ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Mulugu - Aug 05, 2020 , 06:01:40

మొక్కల పెంపకంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి

మొక్కల పెంపకంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి

గోవిందరావుపేట/ ములుగు రూరల్‌ : మొక్కల పెంపకంపై అటవీ శాఖ సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ  చూపాలని వరంగల్‌ సీసీఎఫ్‌ అక్బర్‌ అన్నారు. మండలంలోని పస్రా రేంజ్‌ పరిధిలోని కర్లపల్లి బీట్‌లో ఏర్పాటు చేసిన 10 హెక్టార్ల ప్లాంటేషన్‌ను మంగళవారం సా యంత్రం పరిశీలించారు. ములుగు రేంజ్‌లోని జాకా రం సెక్షన్‌ కాట్రపల్లి ఈస్ట్‌ బీట్‌లోని 340 హెక్టార్లలో ఉన్న సహజ అడవుల పునరుద్దరణ ఏఎన్‌ఆర్‌ కల్చరల్‌ ఆపరేషన్‌ పనులను తనిఖీ చేశారు. అడవులకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జగ్గన్నపేట సాత్‌ బీట్‌లోని 13 హెక్టార్లలో బీహెచ్‌ఏ ప్లాంటేషన్‌ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మొక్కలు నాటడమే కా కుండా వాటిని పెంచేలా ప్రత్యేక చొరవ తీసుకొని హరితహారం కార్యక్రమాలను విజయవంతం చేయాలని సూచించారు. ఆయన వెంట డీఎఫ్‌వో ప్రదీప్‌కుమార్‌శెట్టి, ములుగు ఎఫ్‌డీవో నిఖిత, ట్రైనీ ఐఎఫ్‌ఎస్‌ రాహుల్‌జూదవ్‌, పస్రా రేంజ్‌ అధికారిణి మాధవిసీతల్‌, డీఆ ర్వో సాంబయ్య, మేడారం ఎఫ్‌ఆర్వో గౌతమ్‌రెడ్డి, ఎఫ్‌ఎస్‌వోలు దేవిసింగ్‌, బాలాజీ, ఎఫ్‌బీవోలు ఉన్నారు.  


logo