ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Mulugu - Aug 05, 2020 , 05:58:29

ఏటూరునాగారం పీఏసీఎస్‌ రికార్డులు సీజ్‌

ఏటూరునాగారం పీఏసీఎస్‌ రికార్డులు సీజ్‌

ఏటూరునాగారం,  ఆగస్టు 4 : ఏటూరునాగారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలోని రికార్డులను మంగళవారం డీసీవో విజయభాస్కర్‌రెడ్డి తనిఖీ చేసి సీజ్‌ చేశారు. పీఏసీఎస్‌ పాలక మండలి చైర్మన్‌ కూనూరు అశోక్‌, వైస్‌ చైర్మన్‌ చెన్నూరి బాలరాజు, సభ్యులతో పీఏసీఎస్‌ నిర్వహణ తీరుపై చర్చించి అసంతృప్తి వ్యక్తం చేశారు. సంఘం నిర్వహణ ఇలా ఉంటే ఎలా వారిని ప్రశ్నించారు. పీఏసీఎస్‌లో అక్రమాలు చోటు చేసుకున్నట్లు ఆరోపణలు రావడంతో రికార్డులు, క్యాష్‌బుక్‌లు తదితర వాటిని పరిశీలించారు. 2018-19, 2019-20 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన రిజిస్టర్లను పరిశీలించిన ఆయన నిధులు దుర్వినియోగం జరిగినట్లు, తప్పుడు లెక్కలు ఉన్నట్లు గుర్తించారు. అంతేకాకుండా పలు సందేహాలు ఉండడంతో రికార్డులను సీజ్‌ చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణలో భాగంగా నిధులు ఖర్చు చేయడంపై సీఈవో రంగారావును ప్రశ్నించారు. సంఘం నష్టాల్లో ఉన్నప్పటికీ రెండు పర్యాయాలు బోనస్‌ తీసుకున్నట్లు రికార్డుల తనిఖీలో వెల్లడి కావడంతో ఇలా తీసుకోవడం ఏమిటని ప్రశ్నించారు. రికార్డుల  నిర్వహణ సక్రమంగా లేకపోవడంపై డీసీవో ఆగ్ర హం వ్యక్తం చేశారు. ప్రత్యేకాధికారిని నియమించి విచారణ చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. గత నాలుగు సంవత్సరాల క్రితం మార్క్‌ఫెడ్‌ నుంచి ఎరువులకు సంబంధించి రూ.6 లక్షలు చెల్లించాల్సి ఉందని అప్పటి నుంచి ఎందుకు పెండింగ్‌లో పెట్టారని ప్రశ్నించారు. కాగా, కొన్ని ఎరువులు నిల్వ ఉన్నాయని మరి కొన్నింటిని అమ్మిన  తర్వాత కంప్యూటర్‌ ఆపరేటర్‌కు వేతనం ఇచ్చినట్లు తెలిపారు. మార్క్‌ఫెడ్‌కు ఎలా చెల్లిస్తారని, ఎరువుల విక్రయానికి సంబంధించిన నిర్వహణ పుస్తకాలు ఏవంటూ ప్రశ్నించారు. అయితే సహకార సంఘం ద్వారా ఎరువులు విక్రయించేందుకు అవకాశం కల్పించాలని సభ్యులు కోరగా బకాయి డబ్బులు రూ.6 లక్షలు చెల్లిస్తే అవకాశం ఉందని డీసీవో తేల్చి చెప్పారు. ప్రస్తుతం వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపి నిధుల దుర్వినియోగం జరిగినట్లు తేలితే చర్యలు తీసుకోనున్నటనన్లు డీసీవో పేర్కొన్నారు. 


logo