ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Mulugu - Aug 04, 2020 , 09:09:34

కారు, బైక్‌ ఢీ: నలుగురికి గాయాలు

కారు, బైక్‌ ఢీ: నలుగురికి గాయాలు

ములుగు, ఆగస్టు3: మల్లంపెల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల వద్ద జాతీయ రహదారిపై సోమవారం కారు, బైక్‌ ఢీకొన్న సంఘటనలో నలుగురికి గాయాలయ్యాయి. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. ద్విచక్ర వాహనంపై ఆత్మకూరుకు చెందిన వ్యక్తి తన భార్య, కుమారుడు, కూతురును ఎక్కించుకొని మల్లంపెల్లి నుంచి బోల్లోనిపల్లి వైపు వెళ్తున్నారు. నర్సంపేట నుంచి అతి వేగంగా వచ్చిన కారు బైక్‌ను ఢీకొట్టింది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న తండ్రీ కొడుకులకు కాళ్లు విరగగా, భార్య, కూతురుకు స్వల్ప గాయాలయ్యాయి. గ్రామస్తులు 108కు సమాచారం అందించటంతో నలుగురిని చికిత్స నిమిత్తం హన్మకొండలోని దవాఖానకు తరలించారు. 


logo