ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Mulugu - Aug 03, 2020 , 03:36:51

ఏజెన్సీలో పోలీసుల విస్తృత తనిఖీలు

ఏజెన్సీలో పోలీసుల విస్తృత తనిఖీలు

మంగపేట, ఆగస్టు 2 : మండలంలోని కమలాపురం నుంచి బ్రాహ్మణపల్లి వరకు ప్రధాన రహదారిపై ఉన్న కల్వర్టులను ఎస్సై వెంకటేశ్వర్‌రావు ఆధ్వర్యంలో సివిల్‌, సీఆర్‌పీఎఫ్‌ సిబ్బంది ఆదివారం  తనిఖీ చేశారు. ఇరు వైపులా నుంచి వచ్చి పోయే వాహనాలను  ఆపి, క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రయాణికుల వివరాలు తెలుసుకుని పంపించారు. అనుమతి పత్రాలు, డ్రైవింగ్‌ లైసెన్సులు లేకుండా వాహనాలు నడిపితే చట్టపరమైన చర్యలుంటాయని వాహనదారులను హెచ్చరించారు. మరోవైపు గొత్తి కోయల గూడేలపై కూడా నిఘా పెట్టి, కొత్తవారు రాకుండా కట్టుదిట్టమైన హెచ్చరికలు జారీ చేశారు.

కన్నాయిగూడెంలో..

కన్నాయిగూడెం : మండలకేంద్రంలోని ప్రధాన కూడలిలో ఎస్సై సురేశ్‌ ఆధ్వర్యంలో పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. మావోయిస్టుల వారోత్సవాల కారణంగా రోజూ రహదారి వెంట ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రతి వాహనాన్ని క్షుణంగా పరిశీలించి,  అనుమతిస్తున్నారు. తనిఖీల్లో సివిల్‌, సీఆర్‌పీఎఫ్‌ సిబ్బంది పాల్గొన్నారు.


logo