ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Mulugu - Aug 03, 2020 , 03:37:00

6 నుంచి పస్రాలో స్వచ్ఛంద లాక్‌డౌన్‌

6 నుంచి పస్రాలో స్వచ్ఛంద లాక్‌డౌన్‌

గోవిందరావుపేట, ఆగస్టు 2 : మండలంలోని పస్రా గ్రామంలో ఈ నెల 6 నుంచి 20వ తేదీ వరకు పూర్తి స్థాయిలో స్వచ్ఛంద లాక్‌డౌన్‌ పాటించేందుకు వర్తక సంఘం సభ్యులు నిర్ణయించారు. వర్తక సంఘం అధ్యక్షుడు బూర నరేందర్‌గౌడ్‌ అధ్యక్షతన స్థానిక రామాలయంలో ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు కరోనా వ్యాప్తిపై చర్చించారు. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా స్వచ్ఛంద లాక్‌డౌన్‌ విధించుకున్నట్లు తెలిపారు. పోలీసు, ఆరోగ్య శాఖ సూచనలను ప్రతి ఒక్కరూ పాటించాలని సూచించారు. నిబంధనలు అతిక్రమించి షాపులు తెరిస్తే రూ.2వేల జరిమానా విధించేలా తీర్మానం చేశారు. సమావేశంలో వ్యాపారులు హరి, రాజమల్లు, భూపాల్‌రెడ్డి, రణధీర్‌, సురేశ్‌, ధనుంజయ, అభిలాష్‌, శ్రీనివాస్‌, సంపత్‌రెడ్డి, దిలీప్‌, సదానందం, ప్రసాద్‌, అంజిరెడ్డి, నాగేశ్వర్‌రావు, రమేశ్‌, నాగరాజు, శోభన్‌, నరేందర్‌, రాజు, బాల్‌రెడ్డి, విక్రం, శ్రీనివాస్‌, కరుణాకర్‌రెడ్డి, ఐలయ్య, వెంకట్‌ పాల్గొన్నారు.


logo