సోమవారం 10 ఆగస్టు 2020
Mulugu - Aug 01, 2020 , 02:05:37

‘పల్లెప్రగతి’లో ములుగు జిల్లాకు 2వ స్థానం

‘పల్లెప్రగతి’లో ములుగు జిల్లాకు 2వ స్థానం

ములుగు, జూలై 31 : రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రత కోసం ప్రవేశపెట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర పంచాయతీరాజ్‌ అధికారులు నిర్వహించిన సర్వేలో ములుగు జిల్లాకు రాష్ట్ర స్థాయిలో 2వ స్థానం లభించింది. శుక్రవారం రాష్ట్ర పంచాయతీరాజ్‌ కమిషనర్‌ ఎం రఘునందన్‌రావు జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జిల్లాలో జూలైలో  నిర్వహించిన సర్వేలో వాజేడు మండలంలోని నాగారం, పేరూరు, కన్నాయిగూడెం మండలంలోని ఏటూరు, రాజన్నపేట, గోవిందరావుపేట మండలంలోని లక్ష్మీపూర్‌, మచ్చాపూర్‌ గ్రామాల్లో సర్వే నిర్వహించామన్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు అత్యధిక పాయింట్లు సాధించి ఆ గ్రామాలు ఎంపికైనట్లు ఆయన ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.


logo