శుక్రవారం 14 ఆగస్టు 2020
Mulugu - Aug 01, 2020 , 02:00:21

జంగాలపల్లిలో గుర్తుతెలియని వ్యక్తి మృతి

జంగాలపల్లిలో గుర్తుతెలియని వ్యక్తి మృతి

ములుగురూరల్‌ : మండలంలోని జంగాలపల్లి అంగడి మైదానంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన శుక్రవారం జరిగింది. సర్పంచ్‌ అనితారాణి తెలిపిన వివరాల ప్రకారం.. అంగడి మైదానం దారిన వెళ్లే గ్రామస్తులు గుర్తు తెలియని వ్యక్తి మృతి చెంది ఉండటాన్ని చూసి తమకు సమాచారం అందించారన్నారు. ఈ వ్యక్తి వివరాలు తెలిసిన వారు 9346623112 నంబర్‌లో సంప్రదించాలని ఆమె కోరారు.

ఉరేసుకొని వృద్ధుడి ఆత్మహత్య 

  ఉరేసుకొని వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని బండారుపల్లి గ్రామంలో శుక్రవారం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన లోకుల జంపయ్య (60)  ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వృత్తి రీత్యా చేపలు పట్టే జంపయ్య తన ముగ్గురు కుమార్తెల వివాహం చేశాడని, కొన్ని రోజులుగా తీవ్ర మనోవేదనకు గురయ్యాడని గ్రామస్తులు తెలిపారు. ఈ క్రమంలోనే ఊరేసుకున్నాడన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. logo