బుధవారం 12 ఆగస్టు 2020
Mulugu - Jul 31, 2020 , 01:02:32

హోమ్‌ ఐసొలేషన్‌ కిట్ల ఆవిష్కరణ

హోమ్‌ ఐసొలేషన్‌ కిట్ల ఆవిష్కరణ

ములుగు కలెక్టరేట్‌, జూలై 30 : కొవిడ్‌-19 నియంత్రణ చర్యల్లో భాగంగా జిల్లా కలెక్టర్‌ ఎస్‌ కృష్ణ ఆదిత్య హోమ్‌ ఐసొలేషన్‌ కిట్లను గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చిన వారికి 17 రోజులు హోమ్‌ ఐసొలేషన్‌లో వాడేందుకు మందులు, సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణం, మాస్కులు కిట్‌లో అందజేయనున్న ట్లు తెలిపారు. ఈ కిట్స్‌ ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అందుబాటులో ఉంటాయని అన్నారు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి అప్పయ్య, ఏరి యా దవాఖాన సూపరింటెండెంట్‌ డాక్టర్‌ జగదీశ్వర్‌, ఏటూరునాగారం సూ పరింటెండెంట్‌ డాక్టర్‌ సురేశ్‌, డిస్ట్రిక్‌ ర్యాపిడ్‌ రెస్పాండ్‌ టీం సభ్యులు దుర్గారావు, సీహెచ్‌వో నవీన్‌ రాజ్‌కుమార్‌, ప్రతాప్‌, తిరుపతయ్య పాల్గొన్నారు.

గ్రామాల్లో ఇంటింటి సర్వే 

ములుగు రూరల్‌ : మండలంలోని పలు గ్రామాల్లో గురువారం వైద్య సిబ్బంది ఇంటింటా సర్వే నిర్వహించారు. మల్లంపల్లి, రాయినిగూడెంతో పాటు పలు గ్రామాల్లో ఏఎన్‌ంఎలు, ఆశ వర్కర్లు సర్వే చేపట్టారు. కొవిడ్‌-19 లక్షణాలతో ఎవరైనా ఇండ్లలో ఉన్నారా అని ఆరా తీశారు. వైద్య సిబ్బంది మాట్లాడుతూ దగ్గు, జ్వరం, జలుబుతో ఎవరైనా బాధపడితే తమకు సమాచారం ఇవ్వాలన్నారు. 


logo