గురువారం 06 ఆగస్టు 2020
Mulugu - Jul 31, 2020 , 00:59:41

కరోనా నియంత్రణకు సహకరించాలి

కరోనా నియంత్రణకు సహకరించాలి

  • ప్రైవేటు వైద్యులు, ఆర్‌ఎంపీలు, మెడికల్‌ షాపుల యజమానుల సమావేశంలో తహసీల్దార్లు

ములుగు/ కన్నాయిగూడెం/ వెంకటాపురం (నూగూరు)/ తాడ్వాయి/ఏటూరునాగారం, జూలై 30 : కరోనా వైరస్‌ నియంత్రణకు ప్రైవేటు వైద్యులు, ఆర్‌ఎంపీలు, మెడికల్‌ షాపుల యజమానులు పోలీస్‌, రెవెన్యూ, వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు పూర్తిగా సహకరించాలని తహసీల్దార్లు అన్నారు. గురువారం జిల్లా కేంద్రంతోపాటు పలు మండలాల్లో తహసీల్దార్లు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. 

ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆర్‌ఎంపీలు, మెడికల్‌ షాపుల యజమానులు దగ్గు, జలుబు, జ్వరంతో బాధపడుతూ మందులు కొనుగోలు చేసేందుకు వచ్చే వారి వివరాలతో పాటు ఫోన్‌ నంబర్‌ సేకరించి వైద్య సిబ్బందికి సమాచారం ఇవ్వాలన్నారు. మందుల దుకాణల వద్ద భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు. కొవిడ్‌-19 నిబంధనలు అతిక్రమిస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆర్‌ఎంపీలు సైతం కరోనా లక్షణాలతో చికిత్స పొందేందుకు వచ్చి వారిపై వివక్ష చూపకుండా ప్రాథమిక చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వ దవాఖానలకు వెళ్లేలా అవగాహన కల్పించాలన్నారు.

రోగుల వివరాలను రిజిస్టర్‌లో తప్పనిసరిగా నమోదు చేయాలన్నారు. డాక్టర్‌ ప్రిస్క్రీప్షన్‌ లేకుండా మందులు అమ్మవద్దని మెడికల్‌ షాపు నిర్వాహకులకు సూచించారు. కరోనా వైరస్‌ ప్రస్తుత పరిస్థితుల్లో సామాజిక వ్యాప్తి దశకు చేరుకుందన్నారు. ప్రజలు వైరస్‌పై భయాందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. ఈ సమావేశాల్లో ములుగు, వెంకటాపూర్‌, కన్నాయిగూడెం, వెంకటాపురం (నూగూరు), తాడ్వాయి తహసీల్దార్లు మధురకవి సత్యనారాయణస్వామి, కిశోర్‌కుమార్‌, దేవ్‌ సింగ్‌, అంటి నాగరాజు, శ్రీనివాస్‌,  జిల్లా టీబీ నియంత్రణ అధికారి డాక్టర్‌ పోరిక రవీందర్‌నాయక్‌, వీఆర్వో సూరయ్య,  కన్నాయిగూడెం మెడికల్‌ ఆఫీసర్‌ మెడికల్‌ ఆఫీసర్‌ నవీన్‌, వెంకటాపురం సీఐ కాగితోజు శివప్రసాద్‌, ఎస్సై తిరుపతి, ఎదిర వైద్యాధికారి నరేశ్‌, ఎంపీడీవో అనురాధ, తాడ్వాయి ఎంపీడీవో సత్యాంజనేయప్రసాద్‌, ఏటూరునాగారం ఇన్‌చార్జి తహసీల్దార్‌ దేవ్‌సింగ్‌, రొయ్యూరు మెడికల్‌ ఆఫీసర్‌ వైశాలి,  ప్రైవేటు వైద్యులు, ఆర్‌ఎంపీలు, మెడికల్‌ షాపుల యజమానులు, పోలీస్‌, రెవెన్యూ, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. logo