ఆదివారం 09 ఆగస్టు 2020
Mulugu - Jul 30, 2020 , 02:16:56

కరోనా రోగులపై వివక్ష చూపవద్దు

కరోనా రోగులపై వివక్ష చూపవద్దు

  • ములుగు జడ్పీ చైర్మన్‌ జగదీశ్వర్‌ 

ములుగు, జూలై 29 : జిల్లాలో రోజు రోజుకూ కరోనా వైరస్‌ విస్తరించడంతో రోగుల సంఖ్య పెరుగుతుందని, ప్రజలు వారిపై వివక్ష చూపకుండా మనోధైర్యాన్ని కల్పించాలని జడ్పీచైర్మన్‌ కుసుమ జగదీశ్వర్‌ అన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాలోని అన్ని మండలాల్లో వర్తక వ్యాపారులు పోలీసులు, గ్రామ పంచాయతీ సిబ్బందితో కలిసి ప్రజల సంక్షేమం కోసం స్వచ్ఛంద లాక్‌డౌన్‌ నిర్ణయం తీసుకోవడం అభినందనీయమన్నారు. స్వీయ నిర్బంధం పాటిస్తూ భౌతిక దూరం పాటించాలన్నారు. వైద్యాధికారుల సూచనలు పాటించాలని అన్నారు. కరోనా పాజిటివ్‌ వచ్చిన రోగులను మానసికంగా ఇబ్బందులకు గురిచేయకుండా వారి ఆరోగ్య రక్షణకు తోడ్పాటు అందించాలని తెలిపారు. కరోనా వ్యాధి లక్ష్యణాలు ఉన్న ప్రతి ఒక్కరూ  ప్రభుత్వ దవాఖానాలను సంప్రదించి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలన్నారు. 


logo