సోమవారం 10 ఆగస్టు 2020
Mulugu - Jul 28, 2020 , 03:42:49

సర్పంచ్‌,ఉప సర్పంచ్‌కు షోకాజ్‌ నోటీసులు

సర్పంచ్‌,ఉప సర్పంచ్‌కు షోకాజ్‌ నోటీసులు

ములుగురూరల్‌, జూలై 28: ములుగు మండల పరిధిలోని సర్వాపురం, రాయినిగూడెం, జీవంతరావుపల్లి గ్రామాలకు చెందిన సర్పంచ్‌ లు, ఉప సర్పంచ్‌లకు పంచాయతీరాజ్‌ చట్టం ప్రకారం ప్రభుత్వ ఆదేశాలను అమలు చేయనందున కలెక్టర్‌ ఎస్‌. కృష్ణఆదిత్య సోమవారం షోకా జ్‌ నోటీసులు జారీ చేశారు. గ్రామాల్లో శ్మశానవాటిక, డంపింగ్‌ యార్డు నిర్మాణాల్లో అలసత్వం వహిస్తూ హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయకపోవడంపై పంచాయతీరాజ్‌ చట్టం 2018 సెక్షన్‌ 37, సబ్‌ సెక్షన్‌ 5 ప్రకారంగా నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు.  


logo