ఆదివారం 09 ఆగస్టు 2020
Mulugu - Jul 28, 2020 , 03:42:49

ఆదర్శనీయుడు అబ్దుల్‌కలాం

ఆదర్శనీయుడు అబ్దుల్‌కలాం

ములుగు, జూలై28 : భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్‌కలాం వర్ధంతిని జిల్లా కేంద్రంలో టీఆర్‌ఎస్‌ పార్టీ పట్ణణ అధ్యక్షుడు మేర్గు సంతోష్‌యాదవ్‌ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కలాం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. ఆదర్శనీయుడు అబ్దుల్‌ కలాం అన్నారు. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో విశేష సేవలు అందించి భవిష్యత్‌ తరాలకు ఉపయోగపడే ఎన్నో ప్రయోగాలు చేసిన మహోన్నత వ్యక్తి కలాం అని కొనియాడారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు ఎం.ఏ. సలీం, నాయకులు యశ్వంత్‌, నయీం, ఐలయ్య, ధర్మారావు, శివశంకర్‌, రహీం పాల్గొన్నారు.  logo