శుక్రవారం 14 ఆగస్టు 2020
Ashoka Developers
Mulugu - Jul 28, 2020 , 03:32:51

సొంతపార్టీ మెప్పుకోసమే విమర్శలు

సొంతపార్టీ మెప్పుకోసమే విమర్శలు

  • రాష్ట్ర ఫుడ్‌ కమిషన్‌ సభ్యుడు బానోత్‌ సంగూలాల్‌  

ములుగు, జూలై 28 : సొంతపార్టీ మెప్పు పొందేం దుకే ఎమ్మెల్యే సీతక్క చౌకబారు విమర్శలు చేయడం సరికాదని రాష్ట్ర ఫుడ్‌ కమిషన్‌ సభ్యుడు బానోత్‌ సంగూలాల్‌ అన్నారు. ఈ మేరకు ఆయన సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. బాధ్యతాయుతమైన ఎమ్మెల్యే పదవిలో ఉండి విపత్కర సమయాల్లో ప్రభుత్వానికి సలహాలు అందించాల్సింది పోయి సీఎం కేసీఆర్‌ను విమర్శించడం సరికాదన్నారు. ఆంధ్ర నాయకుల పాలనలో తెలంగాణ ప్రజల కష్టాన్ని చూసిన ఉద్యమ నాయకురాలిగా సీతక్కకు అవగాహన ఉన్నా ఇలాంటి విమర్శలు సరికాదన్నారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ ప్రభా వం పెరుగుతున్నా కేసీఆర్‌ ప్రజలకు తోడుగా నిలుస్తు న్నారన్నారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే  విమర్శలు మానుకోవాలని హితవుపలికారు.


logo