గురువారం 13 ఆగస్టు 2020
Mulugu - Jul 28, 2020 , 02:26:05

టీఆర్‌ఎస్‌లో చేరిన బీజేపీ నాయకులు

టీఆర్‌ఎస్‌లో చేరిన బీజేపీ నాయకులు

ములుగురూరల్‌: మండలంలోని జాకారం గ్రామానికి చెందిన బీజేపీ నాయకులు సోమవారం టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. ఈ మేరకు టీఆర్‌ఎస్‌ ములుగు మండల అధ్యక్షుడు బాదం ప్రవీణ్‌ వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బీజేపీ గ్రామ అధ్యక్షుడు కాలే సంపత్‌ ఆధ్వర్యంలో 40 మంది కార్యకర్తలు గులాబీ గూటికి చేరారు. కార్యక్రమం లో సర్పంచ్‌ దాసరి రమేశ్‌, నాయకులు బ్రహ్మచారి, నారాయణ, శ్రీనివా స్‌, సురేందర్‌, రవీందర్‌, ఐలయ్య, మల్లయ్య, రాజాలు, రఘుపతి, సాంబ య్య, సుధాకర్‌, శ్రీనివాస్‌, శ్రీధర్‌ తదితరులు ఉన్నారు. logo