ఆదివారం 09 ఆగస్టు 2020
Mulugu - Jul 28, 2020 , 02:18:34

మూఢ నమ్మకాలకు బలి

మూఢ నమ్మకాలకు బలి

  • n వేర్వేరు చోట్ల ఇద్దరి హత్య
  • n మంత్రాల నెపంతో ఒకరు.. దిగంబరంగా తిరుగుతున్నాడని మరొకరి హతం
  • n ఉమ్మడి జిల్లాలో కలకలం

తాడ్వాయి/ములుగు: మూఢ నమ్మకాలతో ఓ గొత్తి కోయ వ్యక్తిని, దిగంబరంగా తిరుగుతున్నాడని మరొకరి ని వేర్వేరు చోట్ల చంపిన ఘటన ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో కలకలం రేపింది. ములుగు జిల్లాలోని తాడ్వా యి మండలంలో ఒకరిని, వెంకటాపూర్‌ మండలంలో మరొకరు హత్యకు గురయ్యారు. తాడ్వాయి ఎస్సై రవీందర్‌ కథనం ప్రకారం.. మండలంలోని కొండపర్తి సమీప జలగలంచకు చెందిన కుంజ అడమయ్య పెద నాన్న కొడుకు మడకం అర్జున్‌ ఛత్తీస్‌గఢ్‌లో ఉంటూ అప్పడప్పుడూ వచ్చి పోయేవాడు. ఇదిలా ఉండగా గూడెం పెద్ద కుర్సం జోగయ్య స్థానికులకు దేవున్ని చెబుతుంటాడు. గూడానికి చెందిన కుర్సం బద్రి భార్య ప్రస్తుతం గర్భవతి. అయితే జోగయ్య అర్జున్‌కు మం త్రాలు వస్తాయని, వాటి వల్ల పుట్టబోయే బిడ్డకు మంచి జరగదని బద్రితో చెప్పాడు. దీంతో అర్జున్‌ను ఎలాగైనా చంపాలని బద్రి పథకం వేసుకున్నాడు. బద్రి మడకం మంగయ్యతో కలిసి ఈ నెల 26న మధ్యాహ్నం అర్జు న్‌కు మద్యం తాగించాడు. ఈక్రమంలో మంగయ్య అ ర్జున్‌ను గొడ్డలితో నరుకగా, బద్రి కత్తితో అతని గొంతు కోశాడు. అర్జున్‌ మృతదేహాన్ని నీటి గుంతలో పడేశారు. సోమవారం ఉదయం మడవి రాముకు అర్జున్‌ మృతదే హం కనిపించింది. వెంటనే అతను గూడేనికి సమాచా రం అందించాడు. ఈ మేరకు మృతుడి సోదరుడు కుంజ అడమయ్య ఫిర్యాదు చేయగా బద్రి, మంగయ్య పై కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు.

పట్వారిపల్లిలో..

వెంకటాపూర్‌ ఎస్సై నరహరి కథనం ప్రకారం.. మండలంలోని పట్వారిపల్లి (లక్ష్మీపురం)కి చెందిన మందరపు శ్రీనివాస్‌(42) కొంతకాలంగా విచిత్రంగా ప్రవర్తిస్తూ ఆలయాల్లో దిగంబరంగా పూజలు చేస్తుండే వాడు. ఈ క్రమంలో సోమవారం గ్రామంలోని హను మాన్‌ దేవాలయంలో దిగంబరంగా పూజలు చేస్తుండ గా  గ్రామస్తులు గొడవపడ్డారు. దీంతో శ్రీనివాస్‌ వారి నుంచి తప్పించుకొని తన ఇంటికి రాగా,  గ్రామస్తులు అక్కడికి వచ్చి మూకుమ్మడిగా దాడి చేశారు.  దీంతో తీవ్రంగా గాయపడిన శ్రీనివాస్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ములుగు ఏఎస్పీ సాయిచైతన్య, సీఐ దేవేందర్‌రెడ్డితో పాటు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని గుర్తించి గొడవలు జరగ కుండా గ్రామంలో బందోబస్తు ఏర్పాట్లు చేశారు. మృత దేహాన్ని ములుగు దవాఖానకు తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు. logo