శుక్రవారం 14 ఆగస్టు 2020
Mulugu - Jul 26, 2020 , 07:10:17

పీహెచ్‌సీలకు హోం ఐసొలేషన్‌ కిట్ల పంపిణీ

పీహెచ్‌సీలకు హోం ఐసొలేషన్‌ కిట్ల పంపిణీ

కలెక్టరేట్‌, జూలై 25 : శనివారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి కార్యాలయంలో కరోనా హోం ఐసొలేషన్‌ కిట్లను డీఎంహెచ్‌వో డాక్టర్‌ చల్లా మధుసూదన్‌ జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు పంపిణీ చేశా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని 17 పీహెచ్‌సీలకు హోం ఐసొలేషన్‌ కిట్లను ఇచ్చామన్నారు. ఈ కిట్ల లో శానిటైజర్లు, మాస్కులు, అజిత్రోమైసిన్‌, పారాసిటమ ల్‌, సిట్రిజన్‌, హెచ్‌సీక్యూ ట్యా బ్లెట్లు, సోడియం హైపో క్లోరైట్‌ ద్రావణం ఉంటాయన్నారు. కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్‌ డాక్టర్‌ విపిన్‌కుమార్‌, డిప్యూటీ డీఈఎంవో డాక్టర్‌ స్వరూపారాణి, హెచ్‌ఈ కేవీ రాజు, సీనియర్‌ అసిస్టెంట్‌ త్రివేణి, హెచ్‌ఎస్‌ అమ్జద్‌ అలీ, డీడీఎం నితిన్‌ తదితరులు పాల్గొన్నారు.logo