శుక్రవారం 14 ఆగస్టు 2020
Mulugu - Jul 25, 2020 , 05:57:56

కేటీఆర్‌కు ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు

కేటీఆర్‌కు ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు

  • పుట్టిన రోజున పండ్ల పంపిణీ 

ములుగు : తెలంగాణ జాగృతి ములుగు జిల్లా అ ధ్యక్షుడు, జిల్లా టీబీ నియంత్రణ అధికారి డాక్టర్‌ పోరిక రవీందర్‌ పుట్టిన రోజు సందర్భంగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో రోగులకు ఆ యన పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ రాష్ట్ర జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఇచ్చిన పిలుపు మేరకు సమాజ సేవలో భాగంగా తన పుట్టిన రోజు సందర్భంగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. అదేవిధం గా రాష్ర్టానికి యూత్‌ ఐకాన్‌ అయిన టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ పుట్టిన రోజు నాడే తన పుట్టిన రోజు కావడం తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈమేరకు ఆయన కేటీఆర్‌కు ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆ తర్వాత అభిమానుల సమక్షంలో కేక్‌కట్‌ చేశారు. కార్యక్రమంలో జిల్లా జాగృతి యువజన అధ్యక్షుడు మోడెం శంకర్‌గౌడ్‌, నాయకులు నాజర్‌ఖాన్‌, తదితరులు పాల్గొన్నారు.


logo