మంగళవారం 11 ఆగస్టు 2020
Mulugu - Jul 25, 2020 , 05:55:32

బండారుపల్లిలో హరితహారం

బండారుపల్లిలో హరితహారం

ములుగు రూరల్‌ : ములుగు మండలం బండారుపల్లి గ్రామంలో ప్రభుత్వం చేపట్టిన ఆరో విడుత హరితహారం కార్యక్రమంలో భాగంగా సర్పంచ్‌ అక్కల రఘోత్తం ఆధ్వర్యంలో చేపట్టిన హరితహారం కార్యక్రమంలో తహసీల్దార్‌ సత్యనారాయణ స్వామి పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం ఆయన మొక్కలకు రక్షణగా ట్రీగార్డులను ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్‌ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు హరితహారంలో పాల్గొని మొక్కలను నాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో చంద్రగిరి సంతోష్‌, ఈగ భిక్షపతి, చుంచు తేజ, జన్ను సుమన్‌, తదితరులు పాల్గొన్నారు. 


logo