శనివారం 15 ఆగస్టు 2020
Mulugu - Jul 25, 2020 , 05:53:20

తెలంగాణ రథసారథి కేటీఆర్‌

తెలంగాణ రథసారథి కేటీఆర్‌

  • పాలంపేటకు ప్రపంచంలో గుర్తింపు తెస్తా 
  • ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి
  • కేటీఆర్‌ జన్మదినం సందర్భంగా పాలంపేట దత్తత
  • వందేళ్ల ఆయుష్షుతో ప్రజాసేవ చేయాలని ప్రత్యేక పూజలు 
  • రూ.కోటితో ఉత్తర ముఖ ద్వార ఆర్చీ నిర్మాణానికి శంకుస్థాపన 
  • సీసీ రోడ్ల కోసం రూ.70 లక్షల మంజూరు 
  • జిల్లాలో ఘనంగా కేటీఆర్‌ జన్మదిన వేడుకలు

ములుగు : కాకతీయుల కాలం నాటి సుప్రసిద్ధ ఆలయమున్న వెంకటాపూర్‌ మండలం పాలం పేట గ్రామాన్ని ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చేం దుకు తన వంతు కృషిచేస్తానని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ పుట్టిన రోజు సందర్భంగా ములుగు జెడ్పీ చైర్మన్‌ కుసుమ జగదీశ్వర్‌, రాష్ట్ర జల వనరుల అభివృద్ధి సంస్థల చైర్మన్‌ వీరమల్ల ప్రకాశ్‌, రాష్ట్ర వికలాంగు ల అభివృద్ధి సంస్థ చైర్మన్‌ వాసుదేవారెడ్డి, టీఆర్‌ ఎస్‌ పార్టీ రాష్ట్ర యూత్‌ సెక్రటరీ ఏరువ సతీశ్‌రెడ్డి స్థానిక నాయకులతో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తొలుత కేటీఆర్‌ పేరున రామలింగే శ్వరస్వామికి అర్చన చేయించారు. ఆ తర్వాత ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. అక్కడినుంచి ఆలయ ఉత్తర ముఖ ద్వారం వద్దకు చేరుకొని ఆర్చీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పోచంపల్లి మాట్లాడుతూ ఉద్య మ నాయకుడు కేటీఆర్‌ పది కాలాల పాటు చల్లగా ఉంటూ తెలంగాణ రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలని ఆ రామలింగేశ్వరుడిని వేడుకున్నట్లు తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో మంచి పేరు వచ్చేలా దేశంలోనే తెలంగాణ రాష్ర్టాన్ని నంబర్‌ వన్‌గా తీర్చిదిద్దేందుకు కేటీఆర్‌ చేస్తున్న కృషి మరువలేనిదన్నారు. కేటీఆర్‌ ఆశయాలను అమలుచేసేందుకు తన వంతు కర్తవ్యంగా పాలంపేట గ్రామాన్ని దత్తత తీసుకొని గ్రామ అభివృద్ధి కోసం తన నిధుల నుంచి రూ.70లక్షలు కేటాయించినట్లు తెలిపారు. ఈ నిధుల తో గ్రామ వ్యాప్తంగా ఉన్న అంతర్గత రోడ్ల ను సీసీరోడ్లుగా మార్చివే యనున్నట్లు తెలిపా రు. ఇప్పటికే రామప్ప అభివృద్ది కోసం నూతనంగా సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టి సెంట్రల్‌ లైటింగ్‌ ప నులను పూర్తి చేసి రామప్పను అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు గతంలో ఇచ్చిన హామీ ప్రకా రంగా మిగిలిన పనులను సైతం పూర్తి చేయనున్న ట్లు తెలిపారు. అందులో భాగంగానే సీఎస్‌ఆర్‌ నిధులను సమకూర్చి రూ.కోటితో ఆర్చీ పనులను నేడు ప్రారంభించినట్లు ఎమ్మెల్సీ తెలిపారు.

బంగారు తెలంగాణకు బాటలు

రాష్ట్రం, దేశంలోనే గాక ప్రపంచ స్థాయిలో మన్ననలు పొందిన కేటీఆర్‌ ఆయురారోగ్యాలతో ఉం డాలని సీఎం కేసీఆర్‌ మార్గదర్శనంలో ప్రజలకు మరిన్ని సేవలందించాలని ఆకాంక్షిస్తున్నట్లు రాష్ట్ర జల వనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్‌ వీరమల్ల ప్రకాశ్‌రావు అన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

కోట్లాది ప్రజల ఆశాదీపం కేటీఆర్‌

తెలంగాణ ప్రజల ఆశాదీపం, యువతకు ఆదర్శప్రాయమైన నాయకుడు కేటీఆర్‌ అని ములుగు జెడ్పీ చైర్మన్‌ జగదీశ్వర్‌ అన్నారు. ఆయన పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉంద న్నారు. కార్యక్రమాల్లో రైతుబంధు సమితి జిల్లా కో ఆర్డినేటర్‌ పల్లా బుచ్చయ్య, వెంకటాపూర్‌ ఎంపీపీ బుర్రి రజితసమ్మయ్య, జెడ్పీటీసీ రుద్రమదేవి, టీఆర్‌ఎస్‌ పార్టీ ములుగు, వెంకటాపూర్‌ మండల అధ్యక్షులు బాదం ప్రవీణ్‌, కూరెళ్ల రామాచారి, నాయకులు పోరిక గోవింద్‌నాయక్‌, మల్క రమేశ్‌, అక్కిరెడ్డి రామ్మోహన్‌రావు, పోశాల వీరమల్లు, పన్నాటి రమేశ్‌, సర్పంచ్‌లు రజిత, అశోక్‌, గట్టు కుమారస్వామి పాల్గొన్నారు.

గట్టమ్మకు ప్రత్యేక పూజలు

ములుగు రూరల్‌ : మంత్రి కేటీఆర్‌ పుట్టిన రోజు సందర్భంగా ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, ములుగు జెడ్పీచైర్మెన్‌ కుసుమ జగదీశ్వర్‌, రాష్ట్ర వికలాంగుల అభివృద్ధి సంస్థ చైర్మన్‌ వాసుదేవరెడ్డి, టీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర యూత్‌ సెక్రటరీ ఏరువ సతీశ్‌రెడ్డి గట్టమ్మను దర్శించి పూజలు చేశారు. అనంతరం ఆలయ ఆవరణలో మొక్కలు నాటా రు. ఆ తర్వాత సీఎంఆర్‌ఎఫ్‌ నుంచి మంజూరైన రూ.20వేల చెక్కులను లబ్ధిదారులకు అందించారు. వారి వెంట జాకారం సర్పంచ్‌ దాసరి రమేశ్‌, టీఆర్‌ఎస్‌ పార్టీ మండల అధ్యక్షుడు బా దం ప్రవీ ణ్‌, నాయకుడు పోరిక గోవింద్‌నాయక్‌ తదితరులు ఉన్నారు.

తెలంగాణకు రోల్‌మోడల్‌ కేటీఆర్‌

- జెడ్పీ చైర్మన్‌ కుసుమ జగదీశ్వర్‌

ములుగు రూరల్‌ : టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ తెలంగాణ రాష్ర్టానికి రోల్‌మోడల్‌ అని ములుగు జెడ్పీ చైర్మన్‌ కుసుమ జగదీశ్వర్‌ అన్నారు. మండలంలోని మల్లంపల్లిలో శుక్రవారం కేటీఆర్‌ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్‌ కట్‌ చేసి కేటీఆర్‌ పిలుపు మేరకు ‘గిఫ్ట్‌ ఏ స్మైల్‌'లో భాగంగా 15మంది పేద ప్రజలకు జెడ్పీ చైర్మన్‌ 20 కిలోల చొప్పున బియ్యం, నిత్యావసరాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు బాదం ప్రవీ ణ్‌, ఉపాధ్యక్షుడు మంద రవి, నాయకులు రేనుకుంట్ల సురేశ్‌, తాహెర్‌పాషా, చోటేమియా, మోరె రాజు, ఇమ్మడి ప్రవీణ్‌, నల్లాల సురేశ్‌, భరత్‌, శరత్‌, రమేశ్‌, తదితరులు పాల్గొన్నారు. 

మంగపేట: మంత్రి కేటీఆర్‌ జన్మదినం సందర్భంగా శుక్రవారం టీఆర్‌ఎస్‌ మండల నాయకులు కమలాపురంలోని శ్రీవీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ ప్రాంగణంలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో సీనియర్‌ నాయకుడు పప్పు వెంకట్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ కార్మిక విభాగం ములుగు నియోజకవర్గ అధ్యక్షుడు ఎస్కే కూర్బాన్‌ అలీ, మండల ఉపాధ్యక్షులు పబ్బోజు సత్యనారాయణచారి, సహకార డైరెక్టర్‌ సిద్దంశెట్టి లక్ష్మణ్‌రావు, మండల అధికార ప్రతినిధి కటికనేని దివాకర్‌, తెలంగాణ సోషల్‌ సర్వీస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి కోడం సత్యనారాయణ, గ్రామ కమిటీ అధ్యక్షుడు ఈదునూరి రవీందర్‌,  బానోతు వసురాంనాయక్‌, కోటగిరి గోవర్దన్‌, మీడియా ఇన్‌చార్జి బీస సాంబ య్య, గుడిసేవా నాగేశ్వర్‌రావు పాల్గొన్నారు.

గోవిందరావుపేట : రాష్ట్ర అభివృద్ధి సారథి కేటీఆర్‌ అని టీఆర్‌ఎస్‌ మండల ఇన్‌చార్జి పోరిక గోవింద్‌నాయక్‌ అన్నారు. కేటీఆర్‌ పుట్టిన రోజు సందర్భంగా శుక్రవారం మండలంలోని అన్ని గ్రామాల్లో వేడుకలు నిర్వహించి మొక్కలు నాటారు. టీఆర్‌ఎస్‌ పార్టీ మండల అధ్యక్షుడు మురారి భిక్షపతి ఆధ్వర్యంలో గోవింద్‌నాయక్‌తో పాటు ఎంపీపీ సూడి శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ వెలిశాల స్వరూప, పార్టీ మండల ఉపాధ్యక్షుడు లాకవత్‌ నర్సింహనాయక్‌, నాయకులు అజ్మీరా సురేశ్‌, బానోతు వెంకన్న, బానోతు సంతోష్‌, మువ్వ భాను, ఎల్లావుల రాజశేఖర్‌ ఉన్నారు. 

ఏటూరునాగారం : మంత్రి కేటీఆర్‌ జన్మదినం సందర్భంగా టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో జడ్పీ ఉన్నత పాఠశాలలో మొక్కలు నాటారు. మండల అధ్యక్షుడు గడదాసు సునీల్‌కుమార్‌ మాట్లాడుతూ  నగరాభివృద్ధితో పాటు శాస్త్ర సాంకేతిక రంగంలో కేటీఆర్‌ కీలక పాత్ర పోషిస్తూ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ వైపు నడిపిస్తున్నారన్నారు. కార్యక్రమంలో జిల్లా కో ఆప్షన్‌ సభ్యురాలు వలియాబీ, ఎంపీపీ విజయ, సీనియర్‌ నాయకులు తుమ్మ మల్లారెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి సర్దార్‌పాషా, నాయకులు ఖాజాపాషా, చంద్రబాబు, అంతటి నాగరాజు, ఎండీ సలీంపాషా, కొమిరె రమేశ్‌, రంజిత్‌, జాడి భోజారావు, గుర్రం కనకయ్య, వావిలాల రాంబాబు, తాండ్ర సతీశ్‌, అటికె నాగేశ్వర్‌రావు పాల్గొన్నారు.

వాజేడు: మండలకేంద్రంలో మంత్రి కేటీఆర్‌ జన్మదిన వేడుకలను టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు పెనుమల్లు రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. నాగారం పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఆ తర్వాత పీహెచ్‌సీ వద్ద రోగులకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ తల్లడి పుష్పలత, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు గొంది రమణారావు , టీఆర్‌ఎస్‌ మండల ఉపాధ్యక్షుడు పోలూరి వేణుగోపాల్‌, నాయకులు తల్లడి నానబాబు, కల్లూరి సతీశ్‌, చెన్నం ఎల్లయ్య, సాంబశివరావు, ముడిగ తిరుపతి యాదవ్‌, వెంకటేశ్వర్లు, శ్రీరాపు అశోక్‌, నిజాముద్దీన్‌, రామకృష్ణ పాల్గొన్నారు.

తాడ్వాయి : మంత్రి కేటీఆర్‌ పుట్టిన రోజు సందర్భంగా మండలకేంద్రంలోని రైతు వేదిక భవన నిర్మాణ స్థలంలో శుక్రవారం టీఆర్‌ఎస్‌ నాయకులు మొక్కలు నాటారు. మండల అధ్యక్షుడు బండారి చంద్రయ్య ఆధ్వర్యంలో ఆత్మ చైర్మన్‌ దుర్గం రమణయ్య, నాయకులు ఇంద్రారెడ్డి, జైపాల్‌రెడ్డి, అశోక్‌, నర్సింగరావు, కిరణ్‌కుమార్‌, సమ్మయ్యలు మొక్కలు నాటారు. నాటిన మొక్కలను ఆత్మ చైర్మన్‌ దత్తత తీసుకుని మొక్కలను రక్షించి పెంచుతానని రమణయ్య చెప్పారు.

వెంకటాపురం (నూగూరు): మండలంలోని వీఆర్‌కేపురం గ్రామ పంచాయతీలో రైతు సమన్వయ సమితి జిల్లా నాయకుడు బాలసాని ముత్తయ్య ఆధ్వర్యంలో మంత్రి కేటిఆర్‌ పుట్టిన రోజు సందర్భంగా శుక్రవారం మొక్కలు నాటారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ పాయం రమణ, సర్పంచ్‌ పు నెం శ్రీదేవి, టీఆర్‌ఎస్‌ నాయకులు పిల్లరిశెట్టి ము రళి, డర్రా దామోదర్‌ పాల్గొన్నారు.


logo