మంగళవారం 04 ఆగస్టు 2020
Mulugu - Jul 02, 2020 , 02:01:46

ఆలయాల్లో తొలి ఏకాదశి సందడి

ఆలయాల్లో తొలి ఏకాదశి సందడి

ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు

రుద్రేశ్వరుడు, వీరభద్రుడికి అభిషేకం

శాకంబరీగా భ్రమరాంబికాదేవి

లక్ష్మీనర్సింహుడికి ప్రత్యేక అలంకరణ

సోమేశ్వరుడికి తులసీ దళంతో అర్చన


రెడ్డికాలనీ/ఐనవోలు/మంగపేట/కురవి/పాలకుర్తి, జూలై 01: ఆషాఢ శుద్ధ ఏకాదశి సందర్భంగా ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని ఆలయాల్లో బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. చారిత్రక వేయిస్తంభాల దేవాలయంలో రుద్రేశ్వరుడికి అభిషేకం చేశారు. శివముఖ అలంకరణగావించి మారేడుబిల్వదళార్చన, పుష్పార్చనలు నిర్వ హించారు. పొంగల్‌ నివేదన సమర్పించి మహాహారతి నిర్వహించినట్లు ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ తెలిపారు. ఐనవోలు మల్లికార్జునస్వామి, భ్రమరాంబికాదేవి ఆలయాల్లో  ఆకేరు వాగు నుంచి తెచ్చిన కొత్త జలాలతో స్వామి వారికి జలాభిషేకం చేశారు. అనంతరం భ్రమరాంబికాదేవిని శాకంబరీ మాతగా అలంకరించారు. డీసీసీబీ చైర్మన్‌  మార్నేని రవీందర్‌రావు, ఎంపీపీ మధుమతి, ఆలయ కమిటీ మాజీ చైర్మన్‌ మునిగాల సంపత్‌ కుమార్‌, ఈవో అద్దెంకి నాగేశ్వర్‌రావు, అర్చకులు రవీందర్‌, శ్రీనివాస్‌, పురోహితుడు మధుకర్‌శర్మ, వేదపండితుడు పురుషోత్తమశర్మ పాల్గొన్నారు. మంగపేటలోని మల్లూరు హేమాచల లక్ష్మీనర్సింహస్వామిని ప్రత్యేకంగా అలంకరించారు. కురవి భద్రకాళీ సమేత వీరభద్రస్వామికి రుద్రాభిషేకం నిర్వహించారు. ఈవో సత్యనారాయణ, పూజారులు పాల్గొన్నారు. పాలకుర్తి సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామికి తులసీ దళంతో అర్చనలు, ప్రత్యేక  పూజలు నిర్వహించారు.  కార్యక్రమంలో ఈవో మేకల వీరస్వామి, అర్చకులు దేవగిరి రామన్న, దేవగిరి లక్ష్మన్న, దేవగిరి అనిల్‌కుమార్‌, సునీల్‌ కుమార్‌, డీవీఆర్‌ శర్మ నాగరాజు పాల్గొన్నారు. అలాగే, భక్తులు కాళేశ్వరంలోని త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించారు. అనంతరం పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి దేవస్థానంలో తొలి ఏకాదశి పూజలు నిర్వహించారు.


logo