శనివారం 08 ఆగస్టు 2020
Mulugu - Jul 02, 2020 , 02:01:50

పలుచోట్ల భారీ వర్షం

పలుచోట్ల భారీ వర్షం

మంగపేట : మండల వ్యాప్తంగా బుధవారం కురిసిన భారీ వర్షానికి పంట వరి నారు మడులు, పొలాల్లో నీళ్లు చేరాయి. సాగు బోర్ల సౌకర్యం లేకుండా, చెరువులపై ఆధార పడి సాగు చేసేందుకు వరి నార్లు పోసుకున్న రైతులు సమృద్ధిగా వర్షాలు కురుస్తుండడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. మండల వ్యాప్తంగా కురిసిన వర్షం ప్రభావంతో గౌరారం, ముసులమ్మ వాగుల్లో నీటి ప్రవాహం పెరిగింది.

వాజేడులో వర్షం

వాజేడు : మండల కేంద్రంతో పాటు మండలంలోని ప్రగళ్లపల్లి, మండపాక, జగన్నాథపురం, ధర్మవరం, పేరూరు, పెద్దగొల్లగూడెం, గుమ్మడొదొడ్డి, మొరుమురుకాలనీ, కొప్పుసూరు, ఆర్‌గుంటపల్లి తదితర గ్రామల్లో బుధవారం సాయంత్రం వర్షం కురిసింది. ఉక్కపోతతో ఇబ్బందులకు గురైన ప్రజలు వర్షం కురవడంతో వాతవారణం చల్లబడింది. దీంతో సంతోషం వ్యక్తం చేశారు. పొలాల్లో ఎండిపోతున్న నారు మళ్లకు వర్షం జీవం పోసింది. 

వెంకటాపురం(నూగూరు)లో..

వెంకటాపురం(నూ) : మండలంలో బుధవారం కురిసిన వర్షానికి రైతులు సాగుకు సిద్ధమవుతున్నారు.దుక్కులు దు న్నుకుని సిద్ధంగా ఉన్న రైతులు నార్లు పో సుకునేందుకు సన్నద్ధమవుతున్నారు. చేళ్ల లోని నలుసు తొలగిస్తున్నారు. 

మహాముత్తారంలో.. 

మహాముత్తారం : మండల వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. బుధవారం కురిసిన వర్షానికి చెరువులు, కుంటల్లోకి మురికి నీటి వరద వచ్చి చేరింది. పత్తి గింజలు పెట్టిన రైతుల్లో ఆనందం వెల్లువిరిసింది. నారు మడులను అలికేందుకు కర్షకులు సిద్ధమవుతున్నారు. 


logo