మంగళవారం 04 ఆగస్టు 2020
Mulugu - Jul 02, 2020 , 02:01:53

ఘనంగా తొలి ఏకాదశి

ఘనంగా తొలి ఏకాదశి

భక్తి శ్రద్ధలతో ఆలయాల్లో పూజలు

గణపురం : తొలి ఏకాదశిని మండలంలో బుధవారం భక్తిశ్రద్ధలతో ఘనం గా నిర్వహించారు. గణపేశ్వరాలయం (కోటగుళ్లు)లో ములుగు ఏఏస్పీ సాయి చైతన్య, వరంగల్‌ ఎంజీఎం అసిస్టెంట్‌ ఫ్రొఫెసర్‌ డాక్టర్‌ కోడూరి నవీన్‌కుమార్‌ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదే వి ధంగా పట్టాభిరామస్వామి దేవాలయా ల్లో భక్తులు అభిశేకాలు, వ్రతాలు నిర్వహించారు. బుద్దారం రామలింగేశ్వరస్వామి ఆలయం, చెల్పూర్‌లోని సాంబశివాలయం, కేటీపీపీలోని శ్రీ గణపతి సహిత పార్వతీ సమేత రామలింగేశ్వరస్వామి ఆలయం, మైలారం, గాంధీనగర్‌, బస్వరాజుపల్లి, కొండాపూర్‌, ధర్మారావుపేటలోని ఆలయాల్లో స్వామి వారికి విశేషాలంకారం గావించి, అత్యంత వైభవంగా పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడు నగేశ్‌, సర్పంచ్‌లు దేవేందర్‌, మానస, మంజుల, పీఏసీఎస్‌ చైర్మన్‌ పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి, కేటీపీపీ ఉద్యోగులు పాల్గొన్నారు.

ములుగులో..

ములుగు/ములుగురూరల్‌  :  రామప్ప, మల్లూరు, ఆలయాలు భక్తుల తో కిక్కిరిసిపోయాయి. సంవత్సరంలో తొలి పండుగ కావడంతో పాడి పంట లు, పిల్లా పాపలు చల్లాగా ఉండాలని ఇష్ట దేవతలకు పూజలు చేశారు. మాం సం ప్రియులు మటన్‌ షాపుల వద్ద బారులు తీరారు. ఇదే అదునుగా భావించిన వ్యాపారులు కిలో రూ.6 00లకు వి క్రయించాల్సి ఉండగా రూ.700వరకు విక్రయించి సొమ్ము చేసుకున్నారు. 


ఆలయాల్లో తొలి ఏకాదశి పూజలు

మంగపేట: మండలంలోని ఆయా గ్రామాల ఆలయాల్లో పూజలు నిర్వహించారు. మల్లూరు శ్రీహేమాచల లక్ష్మీనర్సింహస్వామిని ప్రత్యేకంగా అలంకరించగా, దేవస్థానంలో పలువురు భక్తులు దర్శనం చేసుకున్నారు. కమలాపురం బీరప్ప ఆలయంలో గొల్ల, కురుమలు బోనాలతో వచ్చి పూజలు చేసి, బీరప్పకు యాట పోతు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. గ్రామంలో బొడ్రా యి, రామాలయం, సాయిబాబా ఆల యం, వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో భక్తులు పూజలు జరిపారు.

కాటారంలో..

కాటారం: మండల కేంద్రంలోని అయ్యప్ప హరిహరక్షేత్రంతోపాటు ఆయా గ్రామాల్లోని ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేపట్టారు. కరోనా వైరస్‌ వ్యాప్తితో గోదావరినదిలో నీటి ఉధృతి ఎక్కువగా ఉండడంతో దామెరకుంట సమీపంలోని గోదావరిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించేందుకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు.logo