ఆదివారం 05 జూలై 2020
Mulugu - Jul 01, 2020 , 01:57:32

ప్రతి ఒక్కరూ మొక్క లు నాటాలి : ఎమ్మెల్సీ పోచంపల్లి

ప్రతి ఒక్కరూ మొక్క లు నాటాలి : ఎమ్మెల్సీ పోచంపల్లి

సుబేదారి, జూన్‌ 30: సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి సూచించారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా మంగళవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో మొక్క నాటారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ సంక్షేమ, అభివృద్ధి రంగాల్లో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా కోఆర్డినేటర్‌ వై సతీశ్‌రెడ్డి, జెడ్పీటీసీ గుడి వంశీధర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ యూత్‌ నాయకులు తూము హరీశ్‌పటేల్‌, గ్రీన్‌ ఇండియా కోఆర్డినేటర్‌  రాఘవ, టీఆర్‌ఎస్వీ నాయకుడు కిశోర్‌గౌడ్‌ పాల్గొన్నారు.


logo