మంగళవారం 04 ఆగస్టు 2020
Mulugu - Jun 21, 2020 , 02:42:53

దారి తప్పి ఘజియాబాద్‌కు.. ఎస్పీ చొరవతో సొంతూరుకు..

దారి తప్పి ఘజియాబాద్‌కు.. ఎస్పీ చొరవతో సొంతూరుకు..

భూపాలపల్లి : మానసిక స్థితి బాగాలేక దారి తప్పిన ఓ మహిళ.. జిల్లా ఇన్‌చార్జి ఎస్పీ చొరవతో స్వగ్రామానికి చేరుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. మొగుళ్లపల్లి మండలం మెట్‌పల్లి గ్రామానికి చెందిన మామునూరు సువర్ణ స్వగ్రామం నుంచి గోదావరిఖనిలోని ఆయు బంధువుల ఇంటికి వెళ్లింది. తిరిగొచ్చే క్రమంలో మార్చి 17న జమ్మికుంట రైలు బదులు, న్యూఢిల్లీ వైపు వెళ్లే రైలు ఎక్కి అక్కడికి చేరుకుంది. కరోనా నేపథ్యంలో ఢిల్లీలో లాక్‌ డౌన్‌ అమల్లో ఉంది. ఇతర రాష్ట్రం నుంచి వచ్చిన సువర్ణ ను ఢిల్లీలోని ప్రభుత్వ దవాఖాన క్వారంటైన్‌లో ఉంచారు. క్వారంటైన్‌ గడువు ముగియడంతో ఆమె అక్కడినుంచి ఉత్తరప్రదేశ్‌ లోని ఘజియాబాద్‌కు చేరుకుని అక్కడ సంచరిస్తుండగా తెలుగువాడైన విద్యాసాగర్‌, సవర్ణ ను వివరాలు అడిగి ఆమె భర్త రాజయ్యకు ఫోన్లో స మాచారం అందించారు. ఈ విషయాన్ని జిల్లా అడిషనల్‌ ఎస్పీ శ్రీనివాసులుకు రాజయ్య తెలిపారు. శ్రీనివాసులు జిల్లా ఇంచార్జి ఎస్పీ సంగ్రాం సింగ్‌ జీ పాటిల్‌కు సమస్యను తెలిపారు. ఆయన వెంటనే స్పందించి ఘజియాబాద్‌ ఎస్పీతో పాటు షాపిన్‌గౌట్‌ ఎస్‌హెచ్‌వోతో మాట్లాడి మి స్సింగ్‌ మహిళ రక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ఆ తర్వాత మొగుళ్లపల్లి పీఎస్‌ నుంచి కానిస్టేబుల్‌ అన్వర్‌తో పాటు రాజయ్యను ఘజియాబాద్‌కు పంపారు. అక్కడినుం చి వారు షాపిన్‌గౌట్‌కు వెళ్లి అక్కడి ఎస్‌హెచ్‌వో సహకారం తో సువర్ణను ఈ నెల 19న సురక్షితంగా ఇంటికి తీసుకవ చ్చారు. ఈ వివరాలు శనివారం జిల్లా ఇన్‌చార్జి ఎస్పీ సంగ్రాం సింగ్‌ జీ పాటిల్‌ వెల్లడించారు. క్షేమంగా సువర్ణ ఇంటికి చేరడంతో కుటుంబసభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. వారు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. కానిస్టే బుల్‌ అన్వర్‌ను ఎస్పీ అభినందించారు. ఘజియాబాద్‌ ఎస్పీకి, జిల్లా ఎస్పీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.logo