సోమవారం 03 ఆగస్టు 2020
Mulugu - Jun 21, 2020 , 02:28:21

తొమ్మిది హత్యల కేసులో చార్జిషీట్‌ దాఖలు

తొమ్మిది హత్యల కేసులో చార్జిషీట్‌ దాఖలు

వరంగల్‌ క్రైం : గొర్రెకుంటలో తొమ్మిది మందికి మత్తుమందు ఇచ్చి బావిలోకి పడేసి హత్యచేసిన సంఘటనలో పోలీసులు శనివారం చార్జిషీట్‌ దాఖలు చేశారు. 30 రోజుల్లోనే చార్జిషీట్‌ దాఖలు చేసి బాధితుల కుటుంబాలకు  భరోసా కల్పించారు. సీపీ రవీందర్‌ శనివారం మాట్లాడు తూ గత నెల 21న తొమ్మిది హత్యలు జరుగగా నిందితు డు సంజయ్‌కుమార్‌ను గుర్తించి అరెస్టు చేసినట్లు చెప్పారు. 30 రోజుల్లోనే ఆధారాలు సేకరించి చార్జిషీట్‌ ఫైల్‌ చేసినట్లు తెలిపారు. నిందితుడికి త్వరగా శిక్షపడేలా కోర్టుకు విన్నవిస్తామన్నారు. గతంలో చిన్నారి శ్రీహిత కేసులో ఇదే తరహాలో వేగంగా చార్జిషీట్‌ దాఖలు చేసి నిందితుడు పోలెపాక ప్రవీణ్‌కు జిల్లా కోర్టులో మరణశిక్ష పడేలా కృషి చేసినట్లు చెప్పారు. సంజయ్‌కుమార్‌ యాదవ్‌కు సైతం కఠిన శిక్ష పడేలా చార్జిషీట్‌ దాఖలు చేసినట్లు సీపీ తెలిపారు. 


logo