బుధవారం 05 ఆగస్టు 2020
Mulugu - Jun 21, 2020 , 02:19:28

గ్రామాల అభివృద్ధే సీఎం కేసీఆర్‌ ధ్యేయం

గ్రామాల అభివృద్ధే సీఎం కేసీఆర్‌ ధ్యేయం

  • ప్రతి నెల రూ. 300 కోట్లు     
  • సమీక్షలో పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి

సంగెం: గ్రామాల సమగ్రాభివృద్ధే సీఎం కేసీఆర్‌ ధ్యేయమని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. మండలంలోని సర్పంచ్‌లు, అధికారులతో శనివారం హన్మకొండలోని తన నివాసంలో సమీక్షించారు. గ్రామాల అభివృద్ధి కోసం ప్రతినెల రూ. 300 కోట్ల నిధులను ముఖ్యమంత్రి కేటాయిస్తున్నారని గుర్తుచేశారు. మండలంలో అవసరమున్న జీపీలకు కొత్త భవనాల కోసం ప్రతిపాదనలు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో జెడ్పీటీసీ గూడ సుదర్శన్‌రెడ్డి,  రైతుబంధు సమితి మండల కో ఆర్డినేటర్‌ కందకట్ల నరహరి, ఎంపీడీవో ఎన్‌ మల్లేశం, ఎంపీవో కొమురయ్య, ఏఈలు ప్రభాకర్‌, వేణు, సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడు పులుగు సాగర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఉపాధి పనులను వియోగించుకోవాలి

పరకాల: ఉపాధిహామీ పనులను వినియోగించుకోవాలని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. హన్మకొండలోని తన నివాసంలో పశుసంవర్ధక శాఖ అధికారులతో సమీక్షించారు. ఉపాధిహామీ పథకంలో భాగంగా గ్రామాల్లో పశువులకు నీటితొట్లు, పశుగ్రాసం సాగు, శైలిపిట్‌ నిర్మాణం, అజోల్లా, గడ్డి పెంపకం, పశువులు, గొర్రెల, మేకల కోసం పాకలు, కోళ్లఫారం నిర్మాణాలు చేసుకోవాలని సూచించారు. ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా పైలట్‌ ప్రాజెక్టు కింద నియోజకవర్గంలో డెయిరీఫాంలు ఆగస్టులో మంజూరవుతాయన్నారు. గ్రామాల్లో పశువులకు చికిత్స చేసేందుకు 50 పశువుల స్టాండ్ల నిర్మాణానికి రూ. 6.60 లక్షలు మంజూరు చేయించామన్నారు. గీసుకొండలో 3, సంగెంలో 18, దామెరలో 11, పరకాలలో 11, ఆత్మకూరు మండలంలో ఏడు మంజూరైనట్లు చెప్పారు. సబ్సిడీ గొర్రెల కోసం డీడీలు ఇచ్చిన వారికి గొర్రెలు ఇవ్వాలని, లేకుంటే డీడీలను వాపస్‌ చేయాలని అధికారులకు సూచించారు. సమీక్షలో పశుసంవర్ధక శాఖ జేడీ రవికుమార్‌ పాల్గొన్నారు.


logo