మంగళవారం 04 ఆగస్టు 2020
Mulugu - Jun 21, 2020 , 02:16:12

కష్టకాలంలోనూ రైతు సంక్షేమానికి పెద్దపీట

కష్టకాలంలోనూ రైతు సంక్షేమానికి పెద్దపీట

  • ఆపత్కాలంలోనూ అభివృద్ధి, సంక్షేమంపై దృష్టి
  • వసతుల్లో గ్రామాలు పట్టణాలతో పోటీ పడాలె
  • రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి 

రాయపర్తి, జూన్‌ 20: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా కష్టకాలంలోనూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. వరంగల్‌ రూరల్‌ జిల్లా రాయపర్తి మండలకేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్‌ ఆవరణలో హరితహారం కార్యక్రమాన్ని ఆయన భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం  ప్రత్యేక అభివృద్ధి నిధులు రూ. 5 లక్షలతో సర్పంచ్‌ గారె నర్సయ్య నేతృత్వంలో మండలకేంద్రంలో ఏర్పాటు చేసిన హైమాస్ట్‌ లైట్లను ప్రారంభించి మాట్లాడారు. కరోనా మహమ్మారి ప్రపంచ మానవాళికి పెనుముప్పుగా మారిందన్నారు. రాష్ట్రంలో కొంత మెరుగైన పరిస్థితులే ఉన్నా ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. రాష్ట్రంలో  మూడు నెలలుగా లాక్‌డౌన్‌, కర్ఫ్యూ వంటి పరిస్థితులు ఉన్నప్పటికీ దేశానికి అన్నం పెడుతున్న రైతాంగానికి ఎలాంటి ఇబ్బందులు కలుగొద్దనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్‌ ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తున్నట్లు వివరించారు. ఉపాధిహామీ పథకం అనుసంధానంతో కల్లాల నిర్మాణాలు చేపడుతూ రైతులకు వెన్నుదన్నుగా నిలుస్తున్నట్లు  తెలిపారు. హరితహారంలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు.

పట్నాలతో పోటీ పడే రోజులు వస్తాయి

వసతుల కల్పనలో గ్రామాలు పట్నాలతో పోటీ పడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని మంత్రి ఎర్రబెల్లి అభిప్రాయపడ్డారు. మైలారం విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ వద్ద వరంగల్‌-ఖమ్మం జాతీయ రహదారి నుంచి జయరాంతండా, బాల్‌నాయక్‌తండా, సన్నూరు గ్రామాలను కలిపే రహదారిపై బీటీరోడ్డు నిర్మాణ పనులను మంత్రి ప్రారంభించి మాట్లాడారు. మైలారం-జయరాంతండా రోడ్డు నిర్మాణానికి రూ. 40 లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు. రాయపర్తి మండలాన్ని అన్ని రంగాల్లో నియోజకవర్గంలోనే అగ్రగామిగా నిలుపుతానన్నారు. కార్యక్రమాలలో ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, జెడ్పీటీసీ రంగు కుమారస్వామిగౌడ్‌, రైతుబంధు మండల కో ఆర్డినేటర్‌ ఆకుల సురేందర్‌రావు, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు మునావత్‌ నర్సింహనాయక్‌, జిల్లా నాయకుడు బిల్లా సుధీర్‌రెడ్డి, సర్పంచ్‌లు లేతాకుల సుమతి, యాదవరెడ్డి, బానోతు పద్మ, బానోతు జగన్‌నాయక్‌, ఎంపీటీసీలు బిల్లా రాధిక, అయిత రాంచందర్‌, గాడిపల్లి వెంకటయ్య, భూక్య గోవింద్‌నాయక్‌, డీఎల్‌పీవో నాగపురి స్వరూప, తహసీల్దార్‌ కుసుమ సత్యనారాయాణ, ఎంపీడీవో కలికోట రామ్మోహనాచారి, ఈవోపీఆర్డీ తుల రామ్మోహన్‌, ఏపీవో దొనికెల కుమార్‌గౌడ్‌, పీఆర్‌ ఏఈ నరేశ్‌కుమార్‌, ఏవో గుమ్మడి వీరభద్రం, ఎండీ నయీం, కాంచనపల్లి వనజారాణి, మచ్చ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. అనంతరం టీఆర్‌ఎస్‌ గట్టికల్‌ గ్రామ అధ్యక్షుడు చిన్నాల శ్రీనివాస్‌ తండ్రి చిన్నాల వెంకయ్య ఇటీవల మృతి చెందగా, ఎర్రబెల్లి ఆ కుటుంబాన్ని పరామర్శించారు. ఆయన వెంట సర్పంచ్‌ చిన్నాల వనజ, లక్ష్మీనారాయణ, చిన్నాల రాజబాబు, ముక్కాల కరుణాకర్‌, దాసరి శ్రీనివాస్‌ ఉన్నారు.

బిల్లా.. ఎట్లున్నవ్‌..?

సుదీర్ఘ విరామం తర్వాత అనుకోకుండా కలుసుకున్న భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, టీఆర్‌ఎస్‌ రూరల్‌ జిల్లా నాయకుడు బిల్లా సుధీర్‌రెడ్డి మధ్య  ఆత్మీయ సంభాషణ చోటుచేసుకుంది. ఏం బిల్లా.. ఎట్లున్నవ్‌..? అంటూ గండ్ర కుశల ప్రశ్నలు సంధించారు. వెంటనే సుధీర్‌రెడ్డి స్పందిస్తూ.. మంత్రి ఎర్రబెల్లి సార్‌ ఉన్నంక ఎప్పుడూ సంబురమే కదా అన్న... అంటూ చెబుతుండగా... నీకు మంత్రి ఎర్రబెల్లి సారు ఉన్నాడు ఢోకా లేదుపో.. అంటూ ఈ పాతదోస్తులు ముచ్చటించుకోవడం కనిపించింది. కాగా, గండ్ర వెంకటరమణారెడ్డి గతంలో కాంగ్రెస్‌ పార్టీ ఉమ్మడి వరంగల్‌ జిల్లా అధ్యక్షుడిగా, బిల్లా సుధీర్‌రెడ్డి పీసీసీ ఉపాధ్యక్షుడు, డీసీసీబీ మెంబర్‌గా ఏకకాలంలో పని చేశారు. మంత్రి ఎర్రబెల్లి కార్యక్రమం ముగించుకుని రాగానే ఎవరి దారిన వారు వెళ్లిపోయారు.


logo