గురువారం 06 ఆగస్టు 2020
Mulugu - Jun 21, 2020 , 02:10:05

మున్సిపాలిటీలకు కొత్త వాహనాలు

మున్సిపాలిటీలకు కొత్త వాహనాలు

  • నర్సంపేట, పరకాల బల్దియాలకు వాంటెడ్‌
  • నాలుగు ట్రాక్టర్లు, 16 ఆటోల కొనుగోలుకు నిర్ణయం
  • ఫాగింగ్‌ యంత్రాలకు ప్రతిపాదనలు
  • మూడింటిలో 18 కొనేందుకు కసరత్తు 

వరంగల్‌రూరల్‌-నమస్తేతెలంగాణ : పారిశుధ్య నిర్వహణకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుంది. ఇందులో భాగంగా ప్రతి గ్రామ పంచాయతీకి ఒక ట్రాక్టర్‌, మినీ ట్రాక్టర్‌ లేదా ఆటో ట్రాలీ కొనుగోలు చేసింది. ఆయా జీపీల పరిధిలో డంపింగ్‌  యార్డు నిర్మిస్తుంది. తడి, పొడి చెత్త వేరు చేసేందుకు ఇంటింటికీ చెత్త బుట్టలు పంపిణీ చేసింది. పరిశుభ్రత పాటించని వారికి జరిమానా విధిస్తుంది. వర్షాకాలం దృష్ట్యా సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా ఈ నెల ఒకటి నుంచి ఎనిమిదో తేదీ వరకు ప్రత్యే క పారిశుధ్య కార్యక్రమం నిర్వహించింది. శానిటేషన్‌పై  నిర్ల క్ష్యం ప్రదర్శించే సర్పంచ్‌లు, కార్యదర్శులు, ఎంపీవోలపై వేటు వేసే దిశలో అడుగులు వేస్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా పట్టణాల్లోనూ శానిటేషన్‌పై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇప్ప టికే పల్లె ప్రగతి మాదిరిగానే పట్టణాల్లో పట్టణ ప్రగతి కార్యక్ర మం నిర్వహించింది. వర్షాకాలం ప్రారంభం కావడంతో పురపా లక సంఘాల పరిధిలో శానిటేషన్‌పై ప్రత్యేక నజర్‌ పెట్టాలని మంత్రి కేటీ రామారావు అధికారులను ఆదేశించారు. దీంతో వరంగల్‌ రూరల్‌ జిల్లాలోని మున్సిపాలిటీల్లో పారిశుధ్య నిర్వ హణకు కొత్తగా వాహనాలు కొనుగోలు చేయాలని అధికారులు నిర్ణయించారు. జిల్లాలో నర్సంపేట, పరకాల, వర్దన్నపేట మున్సిపాలిటీలు ఉన్నాయి. నర్సంపేట పురపాలక సంఘంలో 4 ట్రాక్టర్లు, 6 ఆటోలు మాత్రమే ఉన్నాయి. ఇక్కడ ఈ వాహనాలు ఏ మూలకు సరిపోవడం లేదు. దీంతో 2 ట్రాక్టర్లు, 6 ఆటోలు కొనుగోలు చేయాలని అధికారులు నిర్ణయించారు. పరకాల మున్సిపాలిటీ పరిధిలో ట్రాక్టర్లు, ఆటోలు లేవు. ఈ నేపథ్యంలో ఇక్కడ 2 ట్రాక్టర్లు, 10 ఆటోలను కొనుగోలు చేసేం దుకు అధికారులు నిర్ణయించారు. వర్దన్నపేట మున్సిపాలిటీలో ఒక ట్రాక్టరు, 5 ఆటోలు ఉన్నాయి. వీటికి తోడు ఈ మొక్కలకు ట్రాక్టర్‌తో నీరు పోసేందుకు ఒక ట్యాంకరు కొంటే సరిపోతుం దనే నిర్ణయానికి అధికారులు వచ్చారు.

కొత్త ఫాగింగ్‌ యంత్రాలు

దోమల నివారణకు మూడు మున్సిపాలిటీల్లోనూ కొత్తగా ఫాగింగ్‌ యంత్రాలు కొనేందుకు అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం నర్సంపేటలో 4, పరకాల, వర్దన్నపేట మున్సిపా లిటీల్లో రెండేసి ఫాగింగ్‌ యంత్రాలు మాత్రమే ఉన్నాయి. ఇవి కూడా సరిగా పనిచేయడం లేదు. దీంతో కొత్తగా నర్సంపేటకు 8, పరకాలకు 6, వర్ధన్నపేటకు 4 ఫాగింగ్‌ యంత్రాల కొనుగో లుకు అధికారులు కసరత్తు చేపట్టారు. ఫాగింగ్‌ యంత్రాల సరఫరాకు ముందుకొచ్చే కంపెనీల నుంచి కొటేషన్లు తీసుకుని సోమవారం రేటు ఫిక్స్‌ చేయనున్నారు. వారం రోజుల్లోగా యంత్రాలు రానున్నాయి. ఈ నెల 25 నుంచి హరితహారం కార్యక్రమం ప్రారంభం కానున్నందున ఆయా మున్సిపాలిటీల పరిధిలో లక్ష్యం మేరకు మొక్కలు నాటేందుకు అధికారులు సమాయత్తం అవుతున్నారు. నర్సంపేట, పరకాల పురపాలక సంఘాల పరిధిలో లక్ష చొప్పున, వర్దన్నపేట పరిధిలో 80 వేల మొక్కలు నాటాలని ప్రభుత్వం టార్గెట్‌ నిర్దేశించింది. గుంతల ఏర్పాటు కోసం ప్రతి మున్సిపాలిటీలో రెండేసి పిటింగ్‌ మిషన్లు కొనుగోలు చేయాలని అధికారులు నిర్ణయించారు.

నర్సరీలకు స్థలాలు

ప్రతి పల్లెలో ఒక నర్సరీ ఏర్పాటు చేసినట్లే ప్రతి మున్సిపాలి టీలో నర్సరీ ఏర్పాటుకు అధికారులు స్థల సేకరణ జరిపారు. నర్సంపేట, పరకాల, వర్ధన్నపేట మున్సిపాలిటీల పరిధిలో నర్స రీ నిర్వహణకు అవసరమైన స్థలాలను కొద్ది రోజుల క్రితం అధి కారులు గుర్తించారు. వచ్చే సంవత్సరం నుంచి ప్రస్తుతం గుర్తిం చిన స్థలాల్లో నర్సరీల నిర్వహణ చేపట్టి మొక్కలు పెంచుతారు. ఈ ఏడాది మాత్రం 70 శాతం మొక్కలు సమీపంలో ఉన్న అట వీ, గ్రామ పంచాయతీల నర్సరీల నుంచి సమకూర్చేందుకు అధికారులు ప్రణాళిక రూపొందించారు. మరో 30 శాతం ఆయా మున్సిపాలిటీ గ్రీనరీ బడ్జెట్‌ నుంచి కొనుగోలు చేస్తారు. ప్రతి మున్సిపాలిటీ పరిధిలో రహదారులకు రెండు వైపులా అవెన్యూ ప్లాంటేషన్‌ కోసం మొక్కలు నాటేందుకు అధికారులు సన్నాహాలు చేపట్టారు. 

ప్రతి మున్సిపాలిటీలో టాయిలెట్స్‌..

- మహేందర్‌రెడ్డి, అదనపు కలెక్టర్‌

ప్రతి మున్సిపాలిటీ పరిధిలో టా యిలెట్స్‌ నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వర్దన్నపేట పరిధిలో ఇప్పటికే రెండు చోట్ల టాయిలెట్స్‌ నిర్మాణం చేపట్టాం. ఆర్టీసీ బస్‌స్టేష న్‌, ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌ వద్ద ఈ టాయిలెట్స్‌ నిర్మాణ పనులు జరుగు తున్నాయి. పరకాలలో పోలీసు స్టేష న్‌, తహసీల్‌ ఆఫీసు ఏరియాలో స్థలాలు గుర్తించాం. త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. నర్సంపేటలో మాత్రం మూడుచోట్ల టాయిలెట్స్‌ కట్టబోతున్నాం. ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌, మున్సిపాలిటీ ఆఫీస్‌, తహసీల్‌ సమీపంలో స్థలాలు గుర్తించాం. సాధ్యమైనంత త్వర లో టాయిలెట్స్‌ నిర్మాణం పూర్తిచేసి వచ్చే ఆగస్టు 15లోగా ప్రారంభించాలని లక్ష్యం పెట్టుకున్నాం. ఎఫ్‌ఎస్‌టీపీ కోసం ప్రతి మున్సిపాలి టీ పరిధిలో ఒక్కో ఎకరం స్థలం అవసరం ఉంది. ఆయా పురపాలక సంఘాల పరిధిలో స్థలం సేకరించే పనిలో ఉన్నాం. నర్సంపేట, పరకాల మున్సిపాలిటీల పరిధిలో డంపింగ్‌ యార్డుల కోసం కూడా స్థలాలను గుర్తిస్తున్నాం.


logo