శనివారం 15 ఆగస్టు 2020
Ashoka Developers
Mulugu - Jun 16, 2020 , 01:13:56

మనోధైర్యంతో వైరస్‌ను ఎదుర్కోవాలి

మనోధైర్యంతో వైరస్‌ను ఎదుర్కోవాలి

ములుగురూరల్‌, జూన్‌15 : కరోనా వైరస్‌పై ప్రజలు అప్రమత్తంగా ఉంటూ మనోధైర్యంతో వైరస్‌ను ఎదుర్కోవాలని ములుగు జిల్లా టీబీ నియంత్రణ అధికారి డాక్టర్‌ పోరిక రవీందర్‌ అన్నారు. ఆయన జిల్లా కేంద్రం పరిధిలోని ఇంచర్ల గ్రామ శివారులో ఉన్న ప్రభుత్వ క్వారంటైన్‌ సెంటర్‌ను సోమవారం సందర్శించారు. క్వారంటైన్‌లో ఉన్న 12మంది అనుమానితుల ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రవీందర్‌ మాట్లాడుతూ క్వారంటైన్‌లో ఉన్న వారిలో ఇద్దరు జ్వరం, దగ్గుతో బాధపడుతుండగా మందులు అందించి సూచనలు చేసినట్లు వివరించారు. ప్రతిఒక్కరూ పౌష్టికాహారం తీసుకుని నిరంతర ఆరోగ్య నియమాలను పాటించడంతో పాటు మాస్కులను ధరిస్తూ భౌతికదూరం పాటించాలని సూచించారు. ఆయన వెంట వైద్య సిబ్బంది పాల్గొన్నారు. 


logo