గురువారం 06 ఆగస్టు 2020
Mulugu - Jun 15, 2020 , 02:50:14

20 వరకు విద్యుత్‌ సరఫరాలో అంతరాయం

20 వరకు విద్యుత్‌ సరఫరాలో అంతరాయం

ములుగు రూరల్‌, జూన్‌ 14 : జిల్లాకేంద్రంలోని సబ్‌స్టేషన్‌లో బ్రేకర్స్‌ మరమ్మత్తుల నేపథ్యంలో ములుగు, బండారుపల్లి, మదనపల్లి, ఇంచర్ల, జంగాలపల్లి, జీవంతరావుపల్లి, బరిగలానిపల్లి గ్రామాల్లో సోమవారం నుంచి ఈనెల 20 వరకు విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఉంటుందని విద్యుత్‌ ఏడీఈ వేణుగోపాల్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 7 నుంచి సాయంత్రం 4గంటల వరకు సరఫరాలో కోత విధించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. 


logo