మంగళవారం 04 ఆగస్టు 2020
Mulugu - Jun 15, 2020 , 02:47:15

క్వారంటైన్‌కు 13మంది తరలింపు

క్వారంటైన్‌కు 13మంది తరలింపు

ములుగు కలెక్టరేట్‌ : వెంకటాపూర్‌ మండలం నర్సాపురంలో ఓ యువకుడికి కరోనా పాజిటివ్‌ వచ్చిన క్రమంలో అతడి కుటుంబసభ్యులు 13మందిని ఆదివారం ఎస్సై నరహరి ఆధ్వర్యంలో ఇంచర్లలో ఏర్పాటుచేసి ప్రభుత్వ క్వారంటైన్‌ సెంటర్‌కు తరలించారు. ఆ తర్వాత గ్రామంలో వీధివీధిన బ్లీచింగ్‌, హైపోసోడియం క్లోరైట్‌ ద్రావణాన్ని గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్‌, సర్పంచ్‌ భద్రయ్య, గ్రామ పంచాయతీ సిబ్బందితో పిచికారీ చేయించారు.

వైద్య సిబ్బందికి నిర్ధారణ పరీక్షలు

ములుగు : నర్సాపూర్‌ యువకుడికి చికిత్స అందించిన ములు గు జిల్లా ప్రభుత్వ దవాఖానలోని 30మంది వైద్య సిబ్బందికి ఆదివారం కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేశారు. ఈమేరకు డీఎంహెచ్‌వో అప్పయ్య, టీబీ నియంత్రణ అధికారి పోరిక రవీందర్‌నాయక్‌ ఆధ్వర్యంలో వారి నుంచి నమూనాలు సేకరించారు. డీఎంహెచ్‌వో మాట్లాడుతూ కరోనా వైరస్‌ సోకిన యువకుడికి వైద్యం చేసిన సిబ్బందితో పాటు అతడి కుటుంబసభ్యుల న మూనాలను వరంగల్‌లోని కాకతీయ మెడికల్‌ కళాశాల ల్యాబ్‌ కు పంపామని చెప్పారు. ఫలితాల ఆధారంగా చికిత్స అందించనున్నట్లు తెలిపారు.

కరోనా కట్టడికి గాయత్రి మంత్ర జపయజ్ఞం

కురవి: కరోనా కట్టడితోపాటు విశ్వమానవాళి సంరక్షణ కోసం సత్యసాయి సేవా సంస్థ పిలుపు మేరకు మండల కేం ద్రంలోని సత్యసాయి భజన మందిరంలో ఆదివారం గాయత్రి మంత్ర జపయజ్ఞం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకురాలు లక్ష్మీతిరుమల్‌రావు మాట్లాడు తూ.. కరోనా నేపథ్యంలో సత్యసాయి భక్తులు తమ ఇళ్లల్లోనే జపాన్ని నిర్వహించాలని కోరారు.logo