మంగళవారం 04 ఆగస్టు 2020
Mulugu - Jun 12, 2020 , 03:53:41

మిడతలపై సమష్టి యుద్ధం

మిడతలపై సమష్టి యుద్ధం

  • భూపాలపల్లి, ములుగు జిల్లాల యంత్రాంగం వ్యూహరచన 
  • సరిహద్దు జిల్లాల సంయుక్త కార్యాచరణ
  • అప్రమత్తమైన భాగస్వామ్య విభాగాలు
  • మిడతలను అడ్డుకునేందుకు  క్రిమిసంహారకాలు సిద్ధం
  • పంచాయతీ, అగ్నిమాపక, వ్యవసాయ,  రెవెన్యూశాఖలకు ఆదేశాలు

ములుగు, నమస్తే తెలంగాణ/కాళేశ్వరం: ‘మిడత ముప్పు ఇప్పటికైతే మనకు లేదు. ఒకవేళ దండెత్తి వచ్చినా సరే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం’ అని రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్లుగానే అన్ని రకాలుగా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నది. సరిహద్దు జిల్లాలను అప్రమత్తం చేసింది. జిల్లా కలెక్టర్లు సంబంధిత విభాగాలను అప్రమత్తం చేస్తున్నా రు. అయితే ముప్పు లేదని అజాగ్రత్తతో ఉండకూడదని ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది. ములుగు, జయశంకర్‌-భూపాలపల్లి జిల్లాలకు మిడతల దండు ప్రమాదం ఉండొచ్చనే అనుమానంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ సరిహ ద్దు జిల్లాలను అప్రమత్తం చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రెండు జిల్లాలోనూ అధికారులు అప్రమత్తమయ్యారు. వివిధ విభాగాలను సన్నద్ధం చేశారు. మిడతల దండు ఏ దిశలో కదులుతున్నదనే అంశాన్ని పరిశీలించాలని.. ఎదుర్కొనేందుకు తగిన సాధన సంపత్తిని సిద్ధం చేసుకోవా లని వ్యవసాయ, రెవెన్యూ, పోలీ స్‌ శాఖలను ప్రభుత్వం స్పష్టం చేసింది. 

ఫైరింజన్‌తో క్రిమిసంహారకాలు

అసంఖ్యాకంగా వచ్చే మిడతలను అడ్డుకునేందుకు ఫైరిం జన్లతో క్రిమి సంహారక మందులను పిచికారి చేసేందుకు అధికారులు సన్నాహాలను చేపట్టారు. జయశంకర్‌ భూపా లపల్లి జిల్లాలోని మహదేవ్‌పూర్‌లో ప్రవేశించే అవకాశాలు ఉన్నాయని, ఆదిలాబాద్‌ జిల్లా నుంచి ఈ మండలంలోకి రావొచ్చని.. 20 గ్రామాలకు తక్షణమే ప్రమాదం ఉండొచ్చని జిల్లా యంత్రాంగం అనుమానిస్తున్నది.

దీనికి అనుస రించాల్సిన వ్యూహంపై జిల్లా కలెక్టర్‌ అహ్మద్‌ అబ్దుల్‌ అజీం గురువారం క్షేత్రస్థాయిలో పర్యటించి.. అధికారులకు తగు సూచనలు చేశారు. మరోవైపు ములుగు జిల్లాలోని వాజేడు, కన్నాయిగూడెం, వెంకటాపురం, ఏటూరునాగారం, మంగపేట మండలాలకు మిడతల ప్రభావం ఉండే అవకా శాలు ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం భావించి జిల్లా యంత్రాం గాన్ని అప్రమత్తం చేసింది. ప్రధానంగా వాజేడు మండలం లో ఉన్న అనేక గ్రామాలు ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దున పేరూరు. సండ్రుపట్ల, టేకులగూడెం క్రిష్ణాపురం, పెద్ద గంగారం, కడెకల్‌, పెనుగోలు గ్రామాలు, వెంకటాపురం మండలం లోని సూరవీడు, వెదిర, ఆలుబాక, తిప్పాపురం, పెంకవాగు, సీతారాంపురం, విజయపురికాలనీ గ్రామాలతోపాటు కన్నా యిగూడెం, ఏటూరునాగారం, మంగపేట మండలాల్లోని అనేక సరిహద్దు గ్రామాలపైనా నిఘా వేశారు. అటవీశాఖ నర్సరీలను కాపాడుకునేందుకు షేడ్‌ నెట్స్‌ తప్పకుండా ఏర్పాటు చేయాలని, అంతే కాకుండా చీరెలు కప్పి మొక్కలు కన్పించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అటవీ శాఖను అప్రమత్తం చేసింది. 

2వేల లీటర్ల క్రిమిసంహారక మందు సిద్ధం

ప్రస్తుతానికైతే ఎటువంటి ప్రమాదం లేదు. ఒకవేళ మిడతల దండు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా సర్కార్‌ ఉందనడానికి ఆయా శాఖల కార్యాచరణ ప్రణాళికే నిదర్శనం గా కనిపిస్తున్నది. రెండు జిల్లాలకు చెందిన వ్యవసాయ శాఖలు క్రిమి సంహారక మందులను సిద్ధం చేసినట్లు అదికారులు పేర్కొన్నారు. ములుగు జిల్లాలో వేయి లీటర్లు క్లోరి ఫైరిపాస్‌, వేయి లీటర్ల మెలాథియాన్‌ అనే క్రిమి సంహా రక మందులను సిద్ధం చేసుకొన్నట్లు వ్యవసాయ శాఖ అధి కారి గౌస్‌ హైదర్‌ తెలిపారు. logo