బుధవారం 12 ఆగస్టు 2020
Mulugu - Jun 11, 2020 , 05:54:46

హరితహారం లక్ష్యాన్ని అధిగమించాలి

హరితహారం లక్ష్యాన్ని అధిగమించాలి

  • ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థల్లో పచ్చదనం పెంపొందించాలి
  • రహదారులకు ఇరువైపులా మొక్కలు నాటాలి
  • ములుగు కలెక్టర్‌ కృష్ణ ఆదిత్య

ములుగు కలెక్టరేట్‌ : పర్యావరణ పరిరక్షణ కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం లక్ష్యాన్ని అధిగమించి విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌.కృష్ణ ఆదిత్య అన్నారు. బుధవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి మా ట్లాడారు. ఈ సంవత్సరం జిల్లాలో 13 లక్షల 50వేల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు తెలిపారు. జిల్లాలో గ్రామానికో నర్సరీ ఏర్పాటుచేసి 12లక్షల 22వేల మొక్కల ఉత్పత్తికి చర్యలు చేపట్టగా 11లక్షల 3వేల 686 మొక్కలు అందుబాటులోకి వచ్చాయన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థ ల్లో మొక్కల పెంచేందుకు ప్రోత్సహించాలన్నారు. జాతీయ రహదారులు అంతర్గత రహదారులకు ఇరువైపుల మొక్కలు నాటి వాటి సంరక్షణకు ట్రీ గార్డ్స్‌ ఏర్పాటు చేయాలన్నారు. వైకుంఠ ధామాలు, డంపింగ్‌ యార్డుల ఆవరణలో విస్తృతంగా మొక్కలు నాటాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు సంస్థలకు కావాల్సిన ప్రతిపాదనలు సమర్పించాలన్నారు. సంక్షేమ హాస్ట ళ్లు, గురుకులాలకు కావాల్సిన స్టేషనరీ, సరుకులకు ఇండెంట్‌ సమర్పించాలన్నారు. టెండర్లు పిలిచి నాణ్యతా ప్రమాణాలతో బల్క్‌గా కొనుగోలు చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు. అసంపూర్తిగా ప్రభుత్వ భవన నిర్మాణ పనులకు వెంటనే పూర్తిచే యాలని ఆదేశించారు. సమావేశంలో డీఎఫ్‌వో ప్రదీప్‌శెట్టి, ట్రైనీ ఐఎఫ్‌ఎస్‌ రాహుల్‌, డీఆర్డీవో పారిజాతం పాల్గొన్నారు.

 మెరుగైన వైద్యం అందించాలి..

మంగపేట : ప్రభుత్వ దవాఖానల్లో మెరుగైన వైద్య సేవలు అం దించాలని జిల్లా కలెక్టర్‌ కృష్ణ ఆదిత్య అన్నారు. మండలంలోని బ్రాహ్మణపల్లి, చుంచుపల్లి, మంగపేట ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాలను బుధవారం ఆయన ఐటీడీఏ పీవో హన్మంతు కే.జం  డగేతో కలిసి తనిఖీ చేశారు. బ్రాహ్మణపల్లి పీహెచ్‌సీ పరిధిలో హైరిస్క్‌ కేసులు, ఈడీడీ కేసులు, మూమెంట్‌ రిజిస్టర్‌ ఓపి సేవల గురించి వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. మూడేళ్లుగా వస్తున్న కేసుల ఆధారంగా అవసరమైన మందులు సిద్ధం చేయాలన్నారు. దవాఖానలో ఉన్న దారిపై కల్వర్టు, ఫ్లోరింగ్‌కు మరమ్మతులతో పాటు ఆవరణ చుట్టూ ఫెన్సింగ్‌ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. చుంచుపల్లి పీహెచ్‌సీని తనిఖీ చేసి వైద్య సిబ్బంది డిప్యుటేషన్‌లను రద్దు చేసి విధులకు హాజరు అయ్యేలా చూడాలన్నారు.

చుంచుపల్లి, మంగపేట దవాఖాన ఆవరణలను శుభ్రంగా ఉంచాలని సూచించారు. మందుల నిల్వలను పరిశీలించారు. అనంతరం రాజుపేట నర్సరీని పరిశీలించి నిర్వహణపై అసహనం వ్యక్తంచేశారు. నిర్వహణ సక్రమంగా చేయాలని లేని పక్షాన చర్యలుంటాయని హెచ్చరించారు. శ్మశానవాటిక, డం పింగ్‌ యార్డు, మిషన్‌ భగీరధ నీటి సరఫరా, పారిశుద్య పనులు తదితర, విషయాలపై అధికారులతో మాట్లాడారు. అనంతరం తహసీల్‌ కార్యాలయాన్ని తనిఖీ చేసి తహసీల్దార్‌ బాబ్జీ ప్రసాద్‌కు సూచనలు చేశారు.  ఫైళ్లు అం శాలవారీగా ఏర్పాటుచేసుకోవాలన్నారు. ఆ తర్వాత మండల పరిషత్‌ కార్యాలయంలో ఆయా శాఖ అధికారులతో పరిపాలనకు సంబంధించి సమీక్ష నిర్వహించారు. సమావేశంలో ఇన్‌చార్జి తహసీల్దార్‌ బాబ్జీ ప్రసాద్‌, ఎంపీడీవో ఆలేటి సుదర్శన్‌, రేంజ్‌ అధికారి షకీల్‌పాషా, ఏవో చేరాలు, ఏపీవో భవాని, డీటీ లక్ష్మణ్‌, ఏఈలు గోపాల్‌, చంద్రశేఖర్‌, వాసు, వైద్యులు మృదు ల, అరుణ, నిఖిత పాల్గొన్నారు.


logo