మంగళవారం 11 ఆగస్టు 2020
Mulugu - Jun 10, 2020 , 05:54:28

‘రాయల్టీ అందేలా చర్యలు తీసుకోవాలి’

‘రాయల్టీ అందేలా చర్యలు తీసుకోవాలి’

శాయంపేట, జూన్‌ 09 : మండలంలోని తహార్‌పూర్‌ గ్రామ పంచాయతీకి దగ్గరలోని క్రషర్స్‌ నుంచి రావాల్సిన రాయల్టీ అందేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు మంగళవారం శాయంపేట తహసీల్దార్‌ హరికృష్ణను కోరారు. ఈ సందర్భంగా గ్రామస్తులు రవివర్మ, అశోక్‌, రవికిరణ్‌ మాట్లాడుతూ తహార్‌పూర్‌ శివారులో క్వారీల్లో విపరీతంగా బ్లాస్టింగ్‌ చేస్తూ రాయిని తరలిస్తున్నట్లు తెలిపారు. అయితే, ప్రభుత్వానికి క్రషర్స్‌ చెల్లించే రాయల్టీ నుంచి గ్రామ పంచాయతీకి 30 శాతం ఆదాయం వస్తుందన్నారు. పుష్కరకాలంగా గ్రామానికి ఎలాంటి రాయల్టీ ఇవ్వడం లేదని ఆరోపించారు. ఇప్పటికైనా క్రషర్ల నుంచి రావాల్సిన రాయల్టీ అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే, బ్లాస్టింగ్‌లపై నోటీసు ఇచ్చి గ్రామసభ ఏర్పాటు చేయాలని కోరారు. 


logo