శనివారం 15 ఆగస్టు 2020
Mulugu - Jun 09, 2020 , 05:47:34

దేవాదుల వద్ద గోదావరిలో ఇసుక లభ్యతపై సర్వే

దేవాదుల వద్ద గోదావరిలో ఇసుక లభ్యతపై సర్వే

కన్నాయిగూడెం, జూన్‌08 : మండలంలోని దేవాదుల వద్ద ఉన్న గోదావరి ఇసుక లభ్యతపై మైనింగ్‌, భూగర్భజల, ఇరిగేషన్‌, రెవెన్యూ, సర్వేయర్‌ ఐదు శాఖల అధికారులు సోమవారం సంయుక్తంగా సర్వే నిర్వహించారు. సొసైటీ ద్వారా ఇసుకను తీసేందుకు ఐదు హెక్టార్లలో అనుకూలంగా ఉన్న ఇసుకను తీసేందుకు పరిశీలించారు. దీనిపై పూర్తి నివేదికను తయారు చేసి ప్రభుత్వానికి పంపనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ సర్వేలో మైనింగ్‌ ఆర్‌ఐ తిరుపతిరావు, జియాలజిస్ట్‌ శ్రీకాంత్‌, ఇరిగేషన్‌ ఏఈ వినోద్‌, తహసీల్దార్‌ దేవాసింగ్‌, వైస్‌ ఎంపీపీ భాస్కర్‌ తదితరులు ఉన్నారు.


తాజావార్తలు


logo