శనివారం 15 ఆగస్టు 2020
Ashoka Developers
Mulugu - Jun 07, 2020 , 02:46:39

వర్షా కాలానికి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి

వర్షా కాలానికి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి

వరంగల్‌ సబర్బన్‌, జూన్‌ 6 : వర్షాకాలంలో మెరుగైన, నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేసేందుకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని ఎన్పీడీసీఎల్‌ సీఎండీ అన్నమనేని గోపాల్‌రావు సంస్థ సీజీఎంలను ఆదేశించారు. హన్మకొండ నక్కలగుట్టలోని విద్యుత్‌ భవన్‌లో శనివారం ఆయన సీజీఎంలో సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ 33/11 కేవీ అంతరాయాలను 2020-21 సంవత్సరానికి విశ్లేషించారు. ట్రాన్స్‌ఫార్మర్ల వైఫల్యాలనూ విశ్లేశించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వ్యవసాయానికి ఫీడర్లను వేరు చేయాలన్నారు. ట్రాన్స్‌ఫార్మర్ల రిపేర్లను డిపార్ట్‌మెంట్‌ షెడ్‌లో పెంచాలన్నారు. గృహ, కమర్షియల్‌, టవర్‌ సర్వీసులకు నిరుపయోగంగా ఉన్న సింగిల్‌ ఫేజ్‌ ట్రాన్స్‌ఫార్మర్లను వినియోగించుకోవాలని కోరారు. ఈదురు గాలులు, తుఫానులకు దెబ్బతిన్న సామగ్రి మార్చడానికి మెటీరియల్‌ను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. ఆన్‌లైన్‌లో రాని బకాయిల జాబితాను రూపొందించుకొని వాటి కార్యాచరణ ముమ్మరం చేసి వసూళ్లు చేయాలన్నారు. ప్రభుత్వ బకాయిలను వసూలు చేయాలన్నారు. స్పాట్‌ బిల్లింగ్‌ను వేగవంతం చేసి రెవెన్యూ కలెక్షన్‌ పెంచాలన్నారు. వర్క్‌ ఆర్డర్స్‌ పూర్తి చేసి ఆన్‌లైన్‌లో చెల్లింపులు జరిగేలా చూడాలన్నారు. బహుళ అంతస్తుల సర్వీసులకు బిల్లింగ్‌ వేర్వేరు చేయాలన్నారు. ఎస్‌సీ/ఎస్టీ వినియోగదారుల నుంచి కుల ధ్రువీకరణ పత్రాలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా వినియోగదారుల మొబైల్‌ నంబర్‌ డేటానూ తీసుకోవాలన్నారు. ఆన్‌లైన్‌లో సర్వీసుల రిలీజ్‌ పురోగతిని అడిగి తెలుసుకోవాలన్నారు. ఆన్‌లైన్‌లో వచ్చే సమస్యల పరిష్కారం స్థితిగతులను తెలుసుకోవాలన్నారు. టీఎస్‌ ఐపాస్‌లో సర్వీసుల మంజూరు వేగవంతం చేయాలన్నారు. వ్యవసాయ సర్వీసు కనెక్షన్లు వెంటనే ఇవ్వాలన్నారు. ప్రీ పెయిడ్‌ మీటర్లు అమర్చడం వాటి పనితీరు వాటిని సర్వర్‌లకు అనుసంధానం చేయాలన్నారు. విధిగా సబ్‌స్టేషన్‌ తనిఖీలు చేయాలన్నారు. కొత్త సబ్‌స్టేషన్ల పురోగతిపై సమీక్షించాలన్నారు. కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్లు బీ వెంకటేశ్వర్లు, పీ గణపతి, డీ నర్సింగరావు, పీ సంధ్యారాణి, పీ మోహన్‌రెడ్డి, సీజీఎంలు బీ అశోక్‌కుమార్‌, సదర్‌లాల్‌, నగేశ్‌, మోహన్‌రావు, కిషన్‌, మధుసూదన్‌, తిరుపతిరెడ్డి, ప్రభాకర్‌, తిరుమల్‌రావు, అశోక్‌, జాయింట్‌ సెక్రటరీ రమేశ్‌, జీఎంలు సత్యనారాయణ, వెంకటరమణ, దేవేందర్‌, కృష్ణమోహన్‌, వేణుబాబు, వెంకటకృష్ణ, శ్రీనివాస్‌, ఎస్‌ఈలు నాగప్రసాద్‌, ఈఈ సివిల్‌ అంకూ స్‌, డీఈ అమర్‌నాథ్‌, అనిల్‌కుమార్‌ పాల్గొన్నారు. logo