శనివారం 15 ఆగస్టు 2020
Mulugu - Jun 06, 2020 , 02:37:06

కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటా

కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటా

మహబూబాబాద్‌ ఎమ్మెల్యే బానోత్‌ శంకర్‌నాయక్‌

కాంగ్రెస్‌ నుంచి ఎంపీటీసీతోపాటు 50 మంది టీఆర్‌ఎస్‌లో చేరిక

నెల్లికుదురు, జూన్‌ 5 : కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని మహబూబాబాద్‌ ఎమ్మెల్యే బానోత్‌ శంకర్‌నాయక్‌ అ న్నారు. మండలంలోని చిన్ననాగారంలో కాం గ్రెస్‌ పార్టీ ఎంపీటీసీ గుగులోత్‌ లక్ష్మణ్‌తోపా టు వార్డు సభ్యులు, కార్యకర్తలు మొత్తం 50 మంది ఎమ్మెల్యే సమక్షంలో శుక్రవారం టీఆర్‌ఎస్‌లో చేరారు. వారికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతించారు. అనంతరం సర్పంచ్‌ జయపాల్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. రైతులు వ్యవసాయ అధికారు లు చెప్పిన పంటలనే సాగు చే యాలన్నారు. అంతకుముం దు మండలంలోని బ్రాహ్మణకొత్తపల్లి ఉపసర్పంచ్‌ చిర్ర యాకాంతంగౌడ్‌ తండ్రి యాదగిరి(70) అనారోగ్యంతో మృతి చెందగా వెళ్లి మృతదేహం వద్ద నివాళి అర్పించారు. కార్యక్రమంలో ఎంపీపీ ఎర్రబెల్లి మాధవి, జెడ్పీటీసీ మేకపోతుల శ్రీనివాస్‌రెడ్డి, వైస్‌ ఎంపీపీ జెల్ల వెంకటేశ్‌,  రైతుబంధు సమితి జిల్లా కో ఆర్డినేటర్‌ భూక్య బాలాజీనాయక్‌, మండల, గ్రామ కో ఆర్డినేటర్లు కాసం వెంకటేశ్వర్‌రెడ్డి, బైరు కొమురయ్య, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పరుపాటి వెంకట్‌రెడ్డి, రమేశ్‌, మీ డియా మండల ఇన్‌చార్జి విజయ్‌యాదవ్‌, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. 


logo