సోమవారం 10 ఆగస్టు 2020
Mulugu - Jun 03, 2020 , 03:17:14

కుక్క పిల్లకు స్నానం చేయించడానికి వెళ్లి

కుక్క పిల్లకు  స్నానం చేయించడానికి  వెళ్లి

చెరువులో పడి బాలుడు మృతి 

గణపురం, జూన్‌02: కుక్క పిల్లకు స్నానం చేయించడానికి వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో పడి బాలుడు మృతి చెందిన సంఘటన మండల కేంద్రంలో మంగళవారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకా రం... మండల కేంద్రానికి చెందిన పత్తెం స్వరూప-రవి దంపతుల కుమారుడు సిద్ధార్థ (13) తన చెల్లెలు బబ్బీతో కలిసి మంగళవారం సాయంత్రం కుక్కపిల్లకు స్నానం చేయించడానికి చెరువు వద్దకు వెళ్లారు. స్నానం చేయిస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు కాలు జారి సిద్ధార్థ చెరువులో పడిపోయాడు. ప్రమాదాన్ని గమనించిన  సిద్ధా ర్థ చెల్లెలు బబ్బీ అరవడంతో సమీపంలోని  వ్యక్తులు చెరువులోకి దూకి బాలుడిని బయటకు తీసి పోలీసులకు సమాచారమిచ్చారు. సంఘటన స్థలానికిచేరుకున్న ఎస్సై తన వాహనంలో బాలుడిని దవాఖానకు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. బాలుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై  తెలిపారు.logo