శనివారం 15 ఆగస్టు 2020
Mulugu - Jun 03, 2020 , 03:04:31

‘వావ్‌ వరంగల్‌' అనేలా తీర్చిదిద్దుతాం

‘వావ్‌ వరంగల్‌' అనేలా తీర్చిదిద్దుతాం

నయీంనగర్‌, జూన్‌ 02: వరంగల్‌ అంటేనే అభివృద్ధికి, సంస్కృతికి, గొలుసుకట్టు చెరువులకు, సహజ సిద్ధమైన రిజర్వాయర్లకు ఒక ఐకాన్‌ అని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లిదయాకర్‌రావు అన్నారు. కాజీపేట ఫాతిమానగర్‌ జంక్షన్‌లో  వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో రూపొందించిన ‘వావ్‌ వరంగల్‌' వాటర్‌ ఫౌంటేన్‌ను చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌తో  కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భం గా మంత్రి మాట్లాడారు. పచ్చదనం, పరిశుభ్రత, దేవాలయాలు తెలంగాణ సంస్కృతికి ప్రతిబింబంగా నిలుస్తాయన్నారు. రాష్ట్ర రాజధాని తర్వాత రెండో స్థానంలో వరంగల్‌ ఉందన్నారు. సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ వరంగల్‌ అభివృద్ధిపై దృష్టి సారిస్తున్నారన్నారు. ఔటర్‌ రింగ్‌రోడ్డు పూర్తయితే మరిన్ని పరిశ్రమలు వచ్చే అవకాశం ఉందన్నారు. అనంతరం మదర్‌థెరిసా విగ్రహానికి పూలమాల వేసి ఆమె సేవలు కొనియాడారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాశ్‌, ఎంపీ పసునూరి దయాకర్‌, మేయర్‌ గుండా ప్రకాశ్‌రావు, మార్కె ట్‌ చైర్మన్‌ సదానందం, కలెక్టర్‌ రాజీవ్‌గాంధీహన్మంతు, మున్సిపల్‌ కమిషనర్‌ పమేలా సత్పతి, కార్పొరేటర్లు స్వప్న, బోడ డిన్నా, నాయకులు పాల్గొన్నారు.

తాజావార్తలు


logo