శనివారం 15 ఆగస్టు 2020
Mulugu - May 31, 2020 , 02:55:29

మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు

మత్స్యకారుల జీవితాల్లో  వెలుగులు

  • పుష్కలంగా చేపలు
  • 10 వేల టన్నుల దిగుబడి.. రూ.10 కోట్ల ఆదాయం!

ములుగు, నమస్తే తెలంగాణ: ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో 796 రిజర్వాయర్లు, చెరువులు, కుంటల్లో చేప పిల్లలను వదిలారు. ములుగు జిల్లాలో 24 మత్స్య సహకార సం ఘాల ద్వారా 355 చెరువుల్లో చేప పిల్లలను పోశారు. రామ ప్ప, లక్నవరం రిజర్వాయర్లు, 32 చెరువులు, 321 కుంటల్లో కోటీ 15 లక్షల 44 వేల 500 చేప పిల్లలను విడుదల చేశారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని 88 మత్స్య సహకార సంఘాల ద్వారా 441 చెరువుల్లో కోటీ 51 లక్షల చేప పిల్లలను వదిలారు. రెండు జిల్లాల్లోని 796 చెరువుల్లో విడుదల చేసిన 2 కోట్ల 66 లక్షల 44 వేల 500 చేప పిల్లలు నేడు సుమారు 10 వేల టన్నుల వరకు దిగుబడి ఇవ్వనున్నాయి. దీంతో మత్స్యకారులకు రూ.10 కోట్ల మేర ఆదాయం సమకూరనుంది. ఈ ఏడాది 6 వేల టన్నుల చేపలను మార్కెట్‌లో  విక్రయించామని, మరో 4వేల టన్నుల చేపలు పట్టాల్సి ఉందని రెండు  జిల్లాల మత్స్యశాఖ అధికారులు భాస్కర్‌, వీర న్న తెలిపారు. అలాగే, ములుగు జిల్లాలో 700 ద్విచక్ర వాహనాలు, 15  టాటా ఏస్‌లు, భూపాలపల్లి జిల్లాలో 1200 ద్విచక్ర వాహనాలు, 70 టాటా ఏస్‌లు, ట్రక్‌ను మత్స్య కారులకు అందించినట్లు వెల్లడించారు. కాళేశ్వరం రిజర్వాయర్‌లో చేపల  పెంపకం కోసం రూ.10 లక్షలు కేటాయించారని, వాటితో బోట్లు, వలలు కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు.


logo