మంగళవారం 26 మే 2020
Mulugu - May 15, 2020 , 01:30:02

భౌతిక దూరం పాటించాలి

భౌతిక దూరం పాటించాలి

  • తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌

వరంగల్‌ చౌరస్తా/మట్టెవాడ/ఖిలావరంగల్‌ : కూరగాయల మార్కెట్‌లో వ్యాపారులు, వినియోగదారులు భౌతికదూరం పాటించాలని వరంగల్‌ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌ సూచించారు. కరోనా నివారణ చర్యల్లో భాగంగా వరంగల్‌ లక్ష్మీపురంలోని కూరగాయల మార్కెట్‌ను రెండు నెలలుగా ఆజంజాహి మిల్లు మైదానంలో నిర్వహిస్తున్నారు. వ్యాపారుల విజ్ఞప్తి మేరకు ఎమ్మెల్యే నరేందర్‌ గురువారం ప్రత్యేక పూజలు చేసి లక్ష్మీపురంలో కూరగాయల మార్కెట్‌ను తిరిగి ప్రారంభించి మాట్లాడుతూ వినియోగదారులు యాప్‌ల ద్వారా నగదు చెల్లించాలని సూచించారు. మేయర్‌ గుండా ప్రకాశ్‌రావు మాట్లాడుతూ మార్కెట్‌ ఆవరణలో పూర్తిస్థాయిలో సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణాన్ని పిచికారీ చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్‌ జారతి రమేశ్‌, సోమిశెట్టి ప్రవీణ్‌ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా వరంగల్‌ మట్టెవాడలోని ఎస్‌ఎస్‌కే సేవా సమాజ్‌ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే 250 మందికి సరుకులు పంపిణీ చేశారు. కరోనా కట్టడి కోసం వరంగల్‌ విద్యానగర్‌కు చెందిన అంగన్‌వాడీ టీచర్‌ సంధ్య నెల వేతనం రూ.10 వేలను క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేకు విరాళంగా అందజేశారు.    


logo